Home » Ramoji Rao
రామోజీరావు మరణం బాధాకరం. భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు. ఆయన సేవలు సినీ, పత్రికా రంగాల్లో చెరగని ముద్ర వేశాయి. తన అవిరళ కృషితో మీడియా, వినోద ప్రపంచాల్లో నూతన ప్రమాణాలను నెలకొల్పారు.
ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకున్నారు.
రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్‌గా, దిగ్గజ వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా అనితర సాధ్యమైన ప్రయాణం సాగించిన రామోజీరావుది సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబం. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామానికి చెందిన చెరుకూరి
బంధుమిత్రుల అశ్రునయనాలు.. ప్రముఖులు, సన్నిహితుల నివాళుల నడుమ.. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి.
తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు రావడానికి కృషి చేసిన వ్యక్తి రామోజీరావు అని వక్తలు కొనియాడారు. ఆయన నికార్సయిన జర్నలిస్టు అన్నారు. క్రమశిక్షణ, సమయపాలనకు పెట్టింది పేరని.. తెలుగును ప్రేమించి, అభిమానించి, పోషించిన వ్యక్తి అని ప్రశంసించారు.
ఇవాళ విజయవాడలో ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు సంస్మరణ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు విజయవాడలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రామోజీరావు సంస్కరణ సభ నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుపై బురదజల్లడమంటే.. నడినెత్తున సూర్యుడిపై వేయడమేనని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి అన్నారు. గత ప్రభుత్వ పాలకుల కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బయట పడిన తర్వాతే ఆయన కన్నుమూశారని తెలిపారు.
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు ఓ అక్షర శిఖరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అచంచలమైన విశ్వాసంతో..
ఈనాడు, రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు, మీడియా దిగ్గజం రామోజీరావు సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తాను చూసిన రామోజీరావులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొన్నారు. సినిమాలు చేసే సమయంలో రామోజీరావుతో ప్రత్యక్ష అనుబంధం లేదని, అయితే 2008లో నేరుగా ఒకసారి రామోజీరావును కలిసి మాట్లాడానని గుర్తుచేసుకున్నారు.
ఇటీవల స్వర్గస్తులైన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు సంస్మరణ సభను గురువారం ఆంధ్రప్రదేశ్లోని కానూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి..