CM Revanth Reddy: సమ్మక్క-సారలమ్మకు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని ప్రారంభించిన రేవంత్..
ABN , Publish Date - Feb 09 , 2024 | 01:27 PM
అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్‌లైన్ ద్వారా మేడారం సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు.
హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్‌లైన్ ద్వారా మేడారం సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు. తన మనవడు రియాన్ష్‌కు నిలువెత్తు బంగారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆన్‌లైన్ ద్వారా సమర్పించారు. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చేసి తన మనవరాలి నిలువెత్తు బంగారాన్ని ఆన్ లైన్ ద్వారా సమర్పించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.