TS News: తెలంగాణ కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్
ABN , Publish Date - Jul 10 , 2024 | 04:46 PM
తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆయన ఉన్నారు.
హైదరాబాద్: తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఆయన ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ డీజీగా ఆదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. 1992వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన జితేందర్ పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లో రైతు కుటుంబంలో జన్మించారు. కాగా తెలంగాణలోని నిర్మల్, బెల్లంపల్లి ఏఎస్పీగా తొలుత విధులు నిర్వర్తించారు.
కాగా 2025 సెప్టెంబరులో జితేందర్ పదవీవిరమణ చేయనున్నారు. దీంతో తెలంగాణ డీజీపీగా 14 నెలలపాటు కొనసాగే అవకాశం ఆయనకు ఉంది. మరోవైపు ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోంశాఖలో ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీగా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం అందిస్తున్న స్కేలు ప్రకారమే ఆయనకు వేతనం అందించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా తెలంగాణ డీజీపీగా నియమితులైన సందర్భంగా సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని జితేందర్ కలిశారు. మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీకి సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఫోన్ ట్యాపింగ్ కేసుపై హై కోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎన్ని కోట్లో తెలుసా?
For more TS News And Telugu News