Financial Help: సాయం చేయండి అయ్యా..: సింహాచలం అభ్యర్థన..
ABN , Publish Date - Aug 05 , 2024 | 02:00 PM
హైదరాబాద్: వారిది రెక్కాడితే గానీ.. డొక్కాడని కుటుంబం.. రోజూ పనికి వెళితేనే జీవనం.. కానీ విధి వక్రీకరించింది. ఓ ప్రమాదం కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టింది. ఇంటి యజమాని మంచానికే పరిమితం కావడంతో వారి బతుకు బండి ఆగిపోయింది. భార్య, ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని పోషించలేక సింహాచలం కుటుంబం సతమతమవుతోంది. ఆపత్కాలంలో ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆ కుంటుంబం ఎదురు చూస్తోంది.
హైదరాబాద్: వారిది రెక్కాడితే గానీ.. డొక్కాడని కుటుంబం.. రోజూ పనికి వెళితేనే జీవనం.. కానీ విధి వక్రీకరించింది. ఓ ప్రమాదం (Acciden) కుటుంబాన్ని (Family) కష్టాల్లోకి (Troubles) నెట్టింది. ఇంటి యజమాని మంచానికే పరిమితం కావడంతో వారి బతుకు బండి ఆగిపోయింది. భార్య, ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని పోషించలేక సింహాచలం కుటుంబం (Simhachalam Family) సతమతమవుతోంది. ఆపత్కాలంలో ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆ కుంటుంబం ఎదురు చూస్తోంది.
ప్రమాదంలో గాయపడిన ఇంటి పెద్ద మంచానికే పరిమితమయ్యాడు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబం పరిస్థితి ఇప్పడు సాయం చేసే వారి కోసం ఎదురు చూస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సింహాచలం 30 ఏళ్ల క్రితం పొట్ట కూటికోసం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. గుడిమల్కాపూర్ మార్కెట్ సమీపంలో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. 2020లో భవన నిర్మాణపని చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా సింహాచలం సోదరులు కిందపడిపోయారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో కేవలం మంచానికే పరిమితమయ్యారు. ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నా ఎలాంటి ఉపయోగం లేదని సింహాచలం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెన్షన్ ద్వారా వచ్చే డబ్బులతో మందులు కొనుగోలు చేస్తున్నట్లు వాపోయాడు. ప్రభుత్వం నుంచి సాయం అందించాలని కోరుతున్నాడు.
భర్త మంచానికే పరిమితం కావడంతో కుటుంబ పోషణ సమస్యగా మారిందని సింహాచలం భార్య కన్నీరు పెట్టుకున్నారు. ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నామని, స్కూల్లో ప్రభుత్వం పెట్టే మధ్యాహ్న భోజనం చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. ఇరుగు, పొరుగువారు ఇచ్చే రేషన్ బియ్యంతో రాత్రి భోజనం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దె, ఖర్చులు, కరెంట్ బిల్లు భరించలేకపోతున్నామని.. ప్రభుత్వం స్పందించి కనీసం ఇంటినైనా మంజూరు చేయాలని ఆమె వేడుకుంటున్నారు. మంచంపై ఉన్నప్పటికీ తాను కుటుంబానికి భారం కాకూడదని సింహాచలం భావిస్తున్నాడు. చెక్కతో బొమ్మలు చెక్కి ఇరుగు, పొరుగువారికి విక్రయిస్తున్నాడు. అయోధ్య రామమందిరంతో పాటు వివిధ పూజా సామాగ్రిని తయారు చేస్తున్నాడు. ఇందుకు యూట్యూబ్ కూడా తనకు ఉపయోగపడుతున్నట్లు సింహాచలం తెలిపాడు. అయితే తాను బ్రతాకాలన్నా.. పిల్లలు కనీసం రెండు పూటలా తినాలన్నా.. ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని వేడుకుంటున్నాడు.
సాయం చేయాలనుకునే దాతలు.. 9948543739 ఫోన్ నెంబర్‌ను సంప్రదించాలని సింహాచలం కోరుతున్నాడు. కుటుంబ అవసరాల కోసం ఆర్థిక స్థోమత లేక నిశ్సహాయుడైన సింహాచలం కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. దాతలు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు సయితం కోరుతున్నారు.