Home » Helping Foundation
విజయవాడ వరదబాధితులకు సాయం అందించేదుకు పలువురు ముం దుకు వచ్చారు.
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఏడాది రక్రితం కువైత్‌కు వచ్చానని, అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తన ఇంటి యజమానులు తనకు నరకం చూపిస్తున్నారని అయినా వాటిని భరిస్తూ వచ్చానని... అయితే నాలుగు రోజుల క్రితం తన భర్త చనిపోయాడని తెలిసిందని, తాను ఇండియాకు వెళతానని చెప్పినా తనను పంపకుండా ఇంకా ఎక్కువగా వేధిస్తున్నారని నారా లోకేశ్ అన్నా... నన్ను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని ఓ మహిళ పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో... ఏదో ఒక మూల ఆకలితో దీనంగా కనిపించే వృద్ధులు. లాక్డౌన్ సడలింపు సమయంలో వీధుల్లోకి వచ్చి... ఆకలికి తీర్చుకోవడానికి యాచించే దీనులు.
‘అప్పుల బాధ నుంచి గట్టెక్కాలని డబ్బు సంపాదన కోసం సౌదీఅరేబియాకు వచ్చాను. ఇక్కడ సేఠ్లు నాకు నరకాన్ని చూపిస్తున్నారు. ఇక్కడి నుంచి ఇండియాకు రప్పించండి సార్..’ అంటూ ఓ మహిళ పంపిన వీడియో వైరల్‌గా మారింది. ట్విటర్లో దీనిని కొందరు మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్ చేశారు. ఆయన చొరవతో సౌదీలోని ఏపీ ఎన్నార్టీ ప్రతినిధి, సోమల మండలం కందూరుకు చెందిన చిట్టలూరి రంజిత్ ఆమెకు బాసటగా నిలిచారు.
వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును కర్రల వంతెనపై నుంచి దాటుతున్న ఈ ఆర్మీ ఉద్యోగి పేరు దామోదర్. ఈయనది మండల కేంద్రమైన పూతలపట్టు. ఇక్కడి పల్లెవీధిలో నివాసం ఉంటున్న ఈయన ఆర్మీలో చేరారు.
హైదరాబాద్: వారిది రెక్కాడితే గానీ.. డొక్కాడని కుటుంబం.. రోజూ పనికి వెళితేనే జీవనం.. కానీ విధి వక్రీకరించింది. ఓ ప్రమాదం కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టింది. ఇంటి యజమాని మంచానికే పరిమితం కావడంతో వారి బతుకు బండి ఆగిపోయింది. భార్య, ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని పోషించలేక సింహాచలం కుటుంబం సతమతమవుతోంది. ఆపత్కాలంలో ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆ కుంటుంబం ఎదురు చూస్తోంది.