Share News

TG News: తెలంగాణలో 13మంది డీఎస్పీలకు పదోన్నతులు..

ABN , Publish Date - Jul 27 , 2024 | 09:09 PM

తెలంగాణ(Telangana)లో వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 13మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీలు బి.ప్రతాప్‌కుమార్‌, ఎ.విశ్వప్రసాద్‌, ఏసీబీలో పనిచేస్తున్న బి. శ్రీకృష్ణాగౌడ్‌, డి.కమలాకర్‌రెడ్డి అలాగే సీఐడీ విభాగంలో ఉన్న కె.శంకర్‌, డి.ఉపేంద్రారెడ్డికి అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించారు.

TG News: తెలంగాణలో 13మంది డీఎస్పీలకు పదోన్నతులు..

హైదరాబాద్‌: తెలంగాణ(Telangana)లో వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 13మంది డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీలు బి.ప్రతాప్‌కుమార్‌, ఎ.విశ్వప్రసాద్‌, ఏసీబీలో పనిచేస్తున్న బి. శ్రీకృష్ణాగౌడ్‌, డి.కమలాకర్‌రెడ్డి అలాగే సీఐడీ విభాగంలో ఉన్న కె.శంకర్‌, డి.ఉపేంద్రారెడ్డికి అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.


హైదరాబాద్‌ టీజీపీఏలో ఉన్న ఎండీ.మాజిద్‌, సైబరాబాద్‌ సీఐ సెల్‌లో ఏసీపీగా ఉన్న పుల్లయ్య, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ డీఎస్పీగా పనిచేస్తున్న జి.బస్వారెడ్డికి అడిషనల్‌ ఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చారు. అలాగే అంబర్‌పేటలోని పీటీసీలో డీఎస్పీలుగా పనిచేస్తున్న పిచ్చయ్య, జి.వేంకటేశ్వరబాబు, నిజామాబాద్‌లోని సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న బి.కిషన్‌, ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న జె.నర్సయ్యకు అడిషనల్‌ ఎస్పీలుగా పదోన్నతి కల్పించారు. వీరంతా 15రోజుల్లోగా డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి:

Crime News: హైదరాబాద్‌కు ఆగని డ్రగ్స్ సరఫరా.. ఒక్క రోజులోనే..

Updated Date - Jul 27 , 2024 | 09:10 PM