Share News

Srinivas Goud: ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేపట్టొద్దు

ABN , Publish Date - Sep 28 , 2024 | 10:00 PM

ఎవరు ఊహించని స్థాయికి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెచ్చుకున్న తెలంగాణ ఏ ప్రాంతం వారికి మనోభావాలు దెబ్బతినకుండా పదేళ్లు పరిపాలించామని అన్నారు.

Srinivas Goud: ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేపట్టొద్దు

ఢిల్లీ: ఎవరు ఊహించని స్థాయికి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెచ్చుకున్న తెలంగాణ ఏ ప్రాంతం వారికి మనోభావాలు దెబ్బతినకుండా పదేళ్లు పరిపాలించామని అన్నారు. ఎన్నో కుట్రలు ఢిల్లీలో పన్నిన కేసీఆర్ కృషితో తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు. పదేళ్లు అయిన హామీలు ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. ఇంకా ఎన్నేళ్లు తెలంగాణ నలిగిపోవాలని అన్నారు.


బయ్యారం ఉక్కు అన్నారు..వాటిని ప్రారంభించలేదని తెలిపారు. రైల్వే కోచ్ అంశంలో అనుకున్న విధంగా రాలేదని చెప్పారు. బీబీ నగర్ ఎయిమ్స్ నామమాత్రంగా ఉందని అన్నారు. అందరూ వత్తిడి తీసుకొని వస్తేనే హామీలు అమలు అవుతాయని తెలిపారు. 7 మండలాలు ఆంధ్రలో కలిపారని చెప్పారు. అయోధ్య తర్వాత శ్రీరామచంద్రుడు వచ్చింది భద్రాచలం అని తెలిపారు. పేరుకే తెలంగాణలో గుడి ఉంది..అందులో 7 మండలాలు ఏపీకి వెళ్లాయని అన్నారు. అందులో కనీసం 7 ఊర్లు ఉంటే ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.7 మండలాలు తెలంగాణలో కలపాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.


‘‘తెలంగాణకు రావాల్సిన 9,10వ షెడ్యూల్ ఆస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. రైతులు అందరికీ రుణమాఫీ ఇంకా కాలేదు. భారతదేశంలో వరి పండించిన దానిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండేది. విభజన హామీల రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాలి. వీలయితే అఖిలపక్షాన్ని తీసుకొచ్చి రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలవాలి. ఈ సమయంలోనే 9,10 షెడ్యూల్ పంపకాలపై కేంద్రాన్ని కలవాలి.కేసీఆర్ బయట కాలు పెడితే ప్రళయం వస్తుంది’’ అని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.


‘‘కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే అవసరాన్ని బట్టి బయటకు వస్తారు. ప్రజలు మమ్మల్ని నమ్మకుండా కాంగ్రెస్ ఏదో చేస్తుందని విశ్వసించారు. ఎఫ్‌డీఎల్, బఫర్ జోన్ అన్నిటినీ మొదట వేర్వేరు చేయాలి. పేదలకు పునరావాసం ఏర్పాటు చేయాలి. మంచి ప్యాకేజీ ఇచ్చి భరోసా కల్పించాలి. కూల్చివేతల్లో అందరినీ సమానంగా చూడాలి. మానవీయ కోణంలో ఆలోచన చేయాలి.పేదలపై రాజకీయ కక్ష్యకు పోకూడదు. ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేపట్టొద్దు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వం’’ అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Updated Date - Sep 28 , 2024 | 10:00 PM