Share News

KCR: కేసీఆర్ నోటీసులపై ఉత్కంఠ

ABN , Publish Date - Jun 14 , 2024 | 01:42 PM

హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ను వివరణ కోరింది. దీంతో ఆయన నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్‌కు కమిషన్ నోటీస్ జారీ చేసింది.

KCR: కేసీఆర్ నోటీసులపై ఉత్కంఠ

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో విద్యుత్ కొనుగోలు (Purchase of electricity), కొత్త ప్రాజెక్టుల (New projects) నిర్మాణ టెండర్లపై (Tenders) ఎల్ నరసింహారెడ్డి (L Narasimha Reddy) కమిషన్ (Commission) బీఆర్ఎస్ అధ్యక్షుడు (BRS Chief), మాజీ సీఎం కేసీఆర్‌ (Ex. CM KCR) ను వివరణ కోరింది. దీంతో ఆయన నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్‌కు కమిషన్ నోటీస్ (Notice) జారీ చేసింది. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జులై 30వ తేదీ వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే కమిషన్ మాత్రం జూన్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ గడువు శనివారంతో ముగియనుండంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది.


ఎన్నికలు ముగియడంతో ఈ అంశంపై లిఖిత పూర్వక వివరణ పంపించేందుకు న్యాయనిపుణులతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. లిఖిత పూర్వక వివరణ పంపించేందుకు కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. గడువులోగా ఆయన నుంచి సమాధానం రాకపోతే కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న విషయంపై ఆశక్తి రేపుతోంది. గడువును పొడిగిస్తుందా? లేక సమన్లు జారీ చేస్తుందా? అన్నది తెలియాలంటే మరో 24 గంటలు ఆగాల్సిందే.


కాగా మూడు అంశాల విచారణ కొనసాగుతోందని పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నోటీసుల్లో పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్లపై విచారణ కొనసాగుతోందని అన్నారు. టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయని, 25 మందికి నోటీసులు ఇచ్చామని నరసింహారెడ్డి పేర్కొన్నారు. కాగా మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వలేదని, సమయం కావాలని కోరారని వివరించారు. మాజీ సీఎండీ, ప్రస్తుత సీఎండీలతో సమావేశం అయ్యామని తెలిపారు. సోమవారం మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, నాటి ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ చందాతో సమావేశం అయ్యామని నరసింహా రావు వివరించారు.


ఎంత నష్టం అనేది తేల్చాలి..

మూడు నిర్ణయాలు అప్పటి ప్రభుత్వం మాత్రమే తీసుకుందని పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి పేర్కొన్నారు. జెన్‌కోకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎస్‌కే జోషి, అరవింద్ కుమార్‌లతో ఇవ్వాళ (మంగళవారం) సమావేశం అయ్యామని చెప్పారు. అరవింద్ కుమార్ అప్పుడే రేగ్యులేటరీ కమిషన్‌కు లేఖ రాశారని, అయితే పట్టించుకోలేదని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి అధికారం ఇవ్వాలని, అయితే రెండు రాష్ట్రాల ఒప్పందంతో ఛత్తీస్‌ఘడ్‌కు అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. భారీగా నిధులు ఖర్చు చేసి పవర్ కొనుగోలు చేశారని, మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం అనేది తేల్చాల్సి ఉందని నరసింహా రెడ్డి పేర్కొన్నారు.


ఇక భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీని పెట్టారని, అంతటా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టారని నరసింహా రెడ్డి వివరించారు. యాదాద్రిలో నామినేషన్ బేస్‌లో ఇచ్చారని, ఇంకా పూర్తి కాలేదని అన్నారు. ఆగస్టు వరకు ఒక లైన్ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు కానీ రైల్వే‌లైన్ వెయ్యలేదని పేర్కొన్నారు. అధికారుల నుంచే కాకుండా ప్రముఖులు నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నామని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబు ఫైలుపై సంతకం పెట్టిన కొన్నిగంటల్లోనే జీవో జారీ

జగన్‌పై టీడీపీ సీనియర్‌ నేత బుచ్చయ్యచౌదరి ఫైర్‌

జీ-7 సమ్మిట్‌కు హాజరైన ప్రధాని మోదీ.. ఇటలీలో బిజీ బిజీ..

గనుల శాఖలో రూ. 350 కోట్ల భారీ స్కాం..

హాట్ టాపిక్‌గా ఆదిమూలపు వ్యవహారం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 14 , 2024 | 01:52 PM