Telangana Assembly Live Updates: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
ABN , First Publish Date - Dec 09 , 2024 | 10:46 AM
Telangana Assembly Live Updates in Telugu: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన తరువాత తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
Live News & Update
-
2024-12-09T11:01:10+05:30
తెలంగాణ ప్రతిరూపమే అధికారికంగా లేదు: సీఎం రేవంత్
అందరితో చర్చించి తెలంగాణ తల్లి రూపంపై నిర్ణయం తీసుకున్నాం.
దేవతలా ఉండాలాలేక మన ఇంట్లో తల్లిలా ఉండాలా అనే చర్చ జరిగింది.
తల్లి ప్రతి రూపమే పెట్టుకోవాలనే అభిప్రాయం వచ్చింది.
అందుకే ఈ రోజు బహుజన తల్లిని ఆవిష్కరిస్తున్నం.
కొందరికి ఇది నచ్చలేదు.
ఒక కుటంబం, ఒక వ్యక్తి తెలంగాణ అనే భావన మంచిది కాదు.
ఈ ఒక్క రోజు రాజకీయాలు పక్కన పెడదాం.
రేపటి నుంచి రాజకీయ అంశాలు ప్రస్తావిద్దాం.
కేసిఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అసదుద్దీన్, కమ్యూనిస్టు నేతలను ఆహ్వానిస్తున్నాం.
అందరూ దీనికి హాజరు కావాలని కోరుతున్న.
-
2024-12-09T10:59:52+05:30
తెలంగాణ తల్లి వేరు, దేవత వేరు : సీఎం రేవంత్
ఏ తల్లికి కిరీటం ఉండదు. దేవతలకు మాత్రమే కిరీటం ఉంటుంది.
ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని.
తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా.
ఈ విషయాన్ని జనాలకు వివరించాలి.
తెలంగాణ తల్లిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పి కొట్టాలి.
-
2024-12-09T10:55:18+05:30
డిసెంబర్ 9 తెలంగాణ ప్రజల పర్వదినం: సీఎం రేవంత్రెడ్డి
2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చింది: సీఎం రేవంత్
తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు
ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు
నా తెలంగాణ.. కోటి రత్నాల వీణ అన్న దాశరథి మాటలు నిత్యసత్యం
భూ ప్రపంచంలో ఏ జాతికైనా గుర్తింపు.. ఆ జాతి అస్తిత్వమే
అస్తిత్వానికి మూలం సంస్కృతి: సీఎం రేవంత్రెడ్డి
సంస్కృతికి ప్రతిరూపమే తల్లి: సీఎం రేవంత్రెడ్డి
స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి
జాతి భావనకు జీవం పోసింది తెలంగాణ తల్లి: సీఎం రేవంత్రెడ్డి
నిరంతరం చైతన్యపరిచి లక్ష్యసాధనవైపు నడిపింది తెలంగాణ తల్లి
-
2024-12-09T10:46:06+05:30
Telangana Assembly Live Updates in Telugu: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన తరువాత తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపనకు సంబంధించి అసెంబ్లీ వేదికగా అధికారిక ప్రకటన చేశారు.