KCR Birthday: ప్రత్యేక లేఖతో కేసీఆర్‌కు బర్త్‌డే విషెష్ చెప్పిన సీఎం రేవంత్..
ABN , Publish Date - Feb 17 , 2024 | 01:38 PM
KCR Birthday: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 71వ పడిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు కేసీఆర్‌కు ప్రత్యేకంగా లేఖ పంపించారు సీఎం రేవంత్.
KCR Birthday: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) 71వ పడిలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు కేసీఆర్‌కు ప్రత్యేకంగా లేఖ పంపించారు సీఎం రేవంత్.
‘కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి.. మీరు 70 ఏళ్లు పూర్తి చేసుకుని మరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్శంగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖను పంపారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా కేసీఆర్ బర్త్‌డే..
కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు అభిమానులు. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేసీఆర్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఊరూ.. వాడా.. గల్లీ గల్లీలో బీఆర్ఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి కేసీఆర్‌ను విష్ చేస్తున్నారు. మరికొందరు అన్నదానాలు, రక్తదానాలు, ఆస్పత్రిలో పండ్ల దానాలు, బెడ్ షీట్స్ దానాలు చేస్తున్నారు.