Share News

HYDRA: హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:46 PM

Telangana: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హైడ్రా ఆర్డినెన్స్‌కు గర్నవర్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. హైడ్రా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన..

HYDRA: హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల
HYDRA

హైదరాబాద్, అక్టోబర్ 5: హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)కు (HYDRA) అధికారికంగా హైపవర్స్‌ వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన హైడ్రా ఆర్డినెన్స్‌కు గర్నవర్‌ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. హైడ్రా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnudev Verma) ఆమోద ముద్ర వేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన గవర్నర్ శనివారం గెజిట్‌ను విడుదల చేశారు.

Good News: నిధులు పడ్డాయోచ్.. మీ అకౌంట్ చెక్ చేసుకున్నారా..


రాష్ట్రంలోని చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను రంగంలోకి దింపింది. జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేయగా.. అప్పటి నుంచి హైడ్రా దూసుకెళ్లింది. ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది. అయితే ఈ కూల్చివేతలపై పలు చోట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించగా.. హైడ్రా చట్టబద్ధతపై కోర్టు కూడా ప్రశ్నించింది. జీవో 99‌పై స్టే ఇవ్వాలంటూ అనేక మంది హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. ఈ క్రమంలో హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది.

Tirumala Laddu: సుప్రీంకోర్టు చెప్పినా.. లడ్డూ వివాదంపై రాజకీయమే.. తీరు మార్చుకోని వైసీపీ


జీహెచ్ఎంసీ చట్టం 1955లో 374 బీ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఓఆర్ఆర్ పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ సర్వాధికారాలు ఇచ్చేలా చట్టం రూపొందించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో అధికారాలను హైడ్రాకు బదలాయించారు. ఈ ఆర్డినెన్స్‌‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపింది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు. గవర్నర్ వ్యక్తం చేసిన పలు సందేహాలకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. ప్రభుత్వ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ హైడ్రా ఆర్డినెన్స్‌ ఫైల్‌పై సంతకం చేశారు. ఆపై గెజిట్‌ను విడదల చేశారు. గెజిట్‌ విడుదలతో హైడ్రాకు ఎదురులేకుండాపోయింది. ఇక చట్టబద్ధత లభించడంతో హైడ్రా మరింత వేగంగా దూసుకుపోనుంది. చెరువులు, నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల విషయంలో తగ్గేదే లే అన్నట్లు చెలరేగిపోనుంది హైడ్రా.


ఇవి కూడా చదవండి..

Bathukamma: నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ.. నైవేద్యం ఇదే

Laxman: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ దేనికి సంకేతం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 05 , 2024 | 05:14 PM