TG highcourt: హైడ్రాపై హైకోర్టుకు కేఏపాల్..
ABN , Publish Date - Oct 04 , 2024 | 01:04 PM
Telangana: హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని పాల్ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం వెల్లడించింది. హైడ్రా కు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ వాదనలు వినిపించారు.
హైదరాబాద్, అక్టోబర్ 4: రాష్ట్రంలో హైడ్రా (HYDR) కూల్చివేతలపై శుక్రవారం హైకోర్టులో (Telangana High Court) విచారణ జరిగింది. జీవో నెంబర్ 99పై స్టే విధించాలంటూ ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ (Prajashanti Party Chief KA Paul) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరుగగా.. హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపేయాలని పాల్ వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికిప్పుడు కూల్చివేతలు ఆపలేమని న్యాయస్థానం వెల్లడించింది. హైడ్రా కు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని పార్టీ ఇన్ పర్సన్‌గా కేఏ పాల్ వాదనలు వినిపించారు. అక్రమ కట్టడాలు కూల్చివేతలకు 30 రోజులు ముందే నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. ప్రతివాదులుగా హైడ్రా, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ ధాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
Tirumala: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. సుప్రీం సంచలన నిర్ణయం
కాగా.. తెలంగాణ ప్రభుత్వం ఈఏడాది జూలై 19న జీవో 99 ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రంగంలోకి దిగిన హైడ్రా ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. మొదట్లో హైడ్రాకు అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ రానురాను హైడ్రాపై నిరసనలు వెల్లువెత్తాయి. పలు చోట్ల హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. హైడ్రాకు చట్టబద్ధత ఉందా, లేదా? అని కొంతమంది ప్రశ్నలు సంధించారు. హైడ్రాను నిలిపివేయాలంటూ అనేక మంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. జోవో 99పై స్టే విధించాలంటూ పట్టుబడుతున్నారు.
AP Politics: రాజకీయాలపై దగ్గుబాటి హాట్ కామెంట్స్
ఈ క్రమంలో హైడ్రాపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు హైపవర్స్ ఇచ్చేసింది. హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు పంపగా.. అందుకు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపై హైడ్రాకు ప్రత్యేక చట్టం కల్పించారు. మున్సిపల్ చట్టంలో 374 - బీ సెక్షన్ చేరుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదం తెలపడంతో ఫైల్‌ను రాజ్ భవన్‌కు పంపింది.
ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ వ్యక్తం చేసిన పలు సందేహాలకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ హైడ్రా ఆర్డినెన్స్ ఫైల్‌పై సంతకం చేశారు. దీన్ని రాజ్ భవన్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. జీహెచ్ఎంసీ చట్టం 1955లో 374 బీ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఓఆర్ఆర్ పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ సర్వాధికారాలు ఇచ్చేలా చట్టం రూపొందించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, వాల్టాయాలోని అధికారాలు హైడ్రాకు బదలాయించారు.
ఇవి కూడా చదవండి..
Bathukamma: ముచ్చటగా మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ
KTR: రుణమాఫీపై ముఖ్యమంత్రివన్నీ డొల్ల మాటలే..
Read Latest Telangana News And Telugu News