Tirumala Laddu: తెలంగాణ దేవాదాయ శాఖ అలర్ట్.. అన్ని ఆలయాల్లో
ABN , Publish Date - Sep 26 , 2024 | 10:15 AM
Telangana: రాష్ట్రంలో పలు ప్రధాన ఆలయాల్లోని లడ్డూల నాణ్యతపై టెస్టులు చేపట్టింది. ప్రముఖ దేవాలయాల్లోని నెయ్యి, ఇతర పదార్థాల శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. అన్ని టెంపుల్స్‌లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 26: తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిర్ధారణ అయిన నేపథ్యంలో తెలంగాణ దేవాదాయ శాఖ (Telangana Devadayasakha) అప్రమత్తం అయ్యింది. రాష్ట్రంలో (Telangana) పలు ప్రధాన ఆలయాల్లోని లడ్డూల నాణ్యతపై టెస్టులు చేపట్టింది. ప్రముఖ దేవాలయాల్లోని నెయ్యి, ఇతర పదార్థాల శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. అన్ని టెంపుల్స్‌లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపై ప్రసాదాల తయారీకి విజయ నెయ్యి, పాలనే వాడాలని ఆర్డర్ పాస్ చేసింది దేవాదాయశాఖ.
Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం
భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. అన్ని ఆలయాల్లో తనిఖీలు చేపట్టాలని దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. లడ్డూలు, పులిహోర తయారీలో వాడే నెయ్యి, యాలకుల పొడి, జీడిపప్పు, చక్కెర పాకం, బూందీ ఇతర ముడి సరుకుల నాణ్యతను పరిశీలించాలని అధికారులను తెలంగాణ దేవాదాయ శాఖ ఆదేశించింది.
దేవాదాయ శాఖ ఆదేశాలతో ఈవోలు ఆలయాల్లో తనిఖీలు చేపట్టారు. నెయ్యి శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. కొన్ని ఆలయాల్లో ప్రత్యేకంగా టెస్టింగ్ కమిటీల ఆధ్వర్యంలో లడ్డూలను తయారుచేస్తున్నారు. వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, బాసర, హనుమకొండ భద్రకాళి ప్రసాదాల్లో వినియోగిస్తున్న నెయ్యి, ఇతర పదార్థాలను పరీక్షల కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు అధికారులు పంపించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి శాంపిల్స్‌ను సేకరించి హైదరాబాద్‌లోని చర్లపల్లిలోని ల్యాబ్‌కు తరలించారు. యాదాద్రిలో పదేళ్లుగా మదర్‌డెయిరీ నెయ్యి వాడకం జరుగుతోంది. నెలకు సుమారు 20 వేల నుంచి 25 వేల కిలోల నెయ్యిని వినియోగించడం జరుగుతుంది. భద్రాచలంలో ప్రసాదాల తయారీకి ప్రత్యేక కమిటీని నియమించారు.
Hydra Strategy: బ్యాంకర్లూ బాధ్యులే?
కాగా.. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఘటన ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు కలిసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తిరుమలలో కల్తీ నెయ్యి వాడకం, తిరుమలలో అపచారాలు జరిగాయని, అధికార దుర్వినియోగం జరిగిందని తదితర ఆరోపణలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను( సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్ ప్రత్యేక అధికారిగా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సర్కార్ నియమించింది. సిట్ కమిటీలో సభ్యులుగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు కొంతమంది పోలీస్ అధికారులకు చోటు కల్పించారు.
ఇవి కూడా చదవండి...
Encounter: నివురు గప్పిన నిప్పులా భద్రాద్రి ఏజెన్సీ
3D Printed Hotel: ప్రపంచంలోనే తొలి త్రీడి ప్రింటింగ్ హోటల్
Read Latest Telangana News And Telugu News