TS Assembly: గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలపనున్న సభ
ABN , First Publish Date - 2024-02-09T07:45:16+05:30 IST
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. నిన్నటి గవర్నర్ ప్రసంగంపై శుక్రవారం సభ ధన్యవాదాలు తెలపనుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. నిన్నటి గవర్నర్ ప్రసంగంపై శుక్రవారం సభ ధన్యవాదాలు తెలపనుంది. సింగరేణి కాలరీస్ వార్షిక నివేదికను, రీజబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ వార్షిక నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశ పెట్టనున్నారు. అలాగే ఫిల్మ్డెవలప్‌మెంట్ కార్పోరేషన్ వార్షిక నివేదికను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. సభ వాయిదా అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ భేటి జరగనుంది. శనివారం సభలో ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడనున్నారు. శాసన మండలిలో దేశపతి శ్రీనివాస్ మాట్లాడతారు.
నేటి శాసన సభా కార్యకలాపాలు
శుక్రవారం ఉదయం 10 గంటలకు శాసన సభ ప్రారంభమవుతుంది. తొలుత బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ సభకు వివరిస్తారు. అనంతరం సింగరేణి కంపెనీకి సంబంధించిన 102వ వార్షిక నివేదికను, తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ 6వ నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెడతారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ 6వ నివేదికను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రవేశపెడతారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపడతారు.