TSRTC: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..
ABN , Publish Date - Apr 05 , 2024 | 10:51 AM
ఐపీఎల్ ఫ్యాన్స్‌కి టీఎస్‌ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్(Hyderabad) వేదికగా ఎస్ఆర్‌హెచ్(SRH), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ యాజమాన్యం. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ అభిమాలు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో నగర నలుమూల..
హైదరాబాద్, ఏప్రిల్ 05: ఐపీఎల్(IPL) ఫ్యాన్స్‌కి టీఎస్‌ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్(Hyderabad) వేదికగా ఎస్ఆర్‌హెచ్(SRH), చెన్నై సూపర్ కింగ్స్(CSK) మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ యాజమాన్యం. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ అభిమాలు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో నగర నలుమూల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్ వ్యాప్తంగా 24 డిపోల నుంచి మొత్తం 60 బస్సులను నడుపుతామని, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. బస్సు సౌకర్యాల కల్పనతో క్రికెట్ మ్యాచ్ కోసం వచ్చే ప్రయాణికులకు ప్రయాణం సులభతరం అవుతుంది. ట్రాఫిక్ సమస్య కూడా తగ్గే అవకాశం ఉంది.
Also Read: పరుగుల వరద ఖాయమేనా?
శుక్రవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. గత మ్యాచ్‌లో పరుగుల వరద పారగా.. నేటి మ్యా్చ్ ఎలా ఉంటుందా? అని ఉత్కంఠ రేపుతోంది. ఈ మ్యా్చ్‌కు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ కోసం బస్సులు నడపడం వలన సంస్థకు ఆదాయం కూడా పెరుగుతుంది.
ఇవి కూడా చదవండి: