Share News

Hyderabad: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నీళ్లు బంద్.. ఎప్పటివరకంటే

ABN , Publish Date - Jun 07 , 2024 | 08:13 AM

హైదరాబాద్‌లోని(Hyderabad) పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని HMWS&SB వెల్లడించింది. శేర్ లింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలపై ఈ ప్రభావం పడుతుందని తెలిపింది.

Hyderabad: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నీళ్లు బంద్.. ఎప్పటివరకంటే

హైదరాబాద్: హైదరాబాద్‌లోని(Hyderabad) పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని HMWS&SB వెల్లడించింది. శేర్ లింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలపై ఈ ప్రభావం పడుతుందని తెలిపింది.

పటాన్‌చెరు, ఆర్‌సీపురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, హఫీజ్‌పేట్, డోయెన్స్ కాలనీ, ఎస్‌బీఐ శిక్షణా కేంద్రం, బీహెచ్‌ఈఎల్‌లకు తాగునీరు సరఫరా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (HMWS&SB ) ప్రకటించింది.


టౌన్‌షిప్, హెచ్‌సీయూ, పటాన్‌చెరు పారిశ్రామికవాడలో శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు తెలిపింది. పైపులైన్ల మరమ్మతుల కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని ప్రజలు సహకరించాలని వాటర్ బోర్డు అధికారులు కోరారు. వర్షాకాలానికి సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి:

Viral news: దక్షిణ కజకిస్థాన్‌‌లో బయటపడిన నిధి.. అందులో ఏం ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Updated Date - Jun 07 , 2024 | 08:16 AM