Share News

Rythu Bharosa: రైతు భరోసా నియమ నిబంధనలు ఇవేనా.. ?

ABN , Publish Date - Dec 26 , 2024 | 05:44 PM

Rythu Bharosa: రైతు భరోసా అమలు కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏడు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఐటీ, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం అమలు కాదనట్లు తెలుస్తుంది.

Rythu Bharosa: రైతు భరోసా నియమ నిబంధనలు ఇవేనా.. ?

రాష్ట్రంలోని రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని తీసుకు వచ్చింది. రైతు బంధు పథకాన్ని ఏడెకరాల వరకు పరిమితి విధించింది. అయితే అదాయపు పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రజా ప్రతినిధులకు.. ఈ పథకం వర్తించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకోసం రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సిద్దం చేస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం తరహాలో.. ఈ పథకాన్ని సైతం అమలు చేయ్యాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లు సమాచారం.

అందులోభాగంగా కుటుంబంలో ఎంతమంది పేరిట భూమి ఉన్నా.. అందరిని ఒకే లెక్క కట్టి కుటుంబాన్ని ఓ యూనిట్‌గా తీసుకొని గరిష్టంగా ఏడెకరాల వరకే రైతుబంధు పరిమితం చేసి.. అంతవరకే రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రభుత్వం ప్రణాళికలను సైతం సిద్దం చేస్తోంది.

రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం అందిస్తుంది. రెండు పంటలకు కలిపి.. ఖరీఫ్, రబీ సీజన్‌లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10,000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతులకు చెక్కుల రూపంలో ఇస్తున్నారు.


తొలుత ఈ పథకం..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో అంటే.. ఈ పథకం ప్రారంభం సమయంలో.. 2018-19 సంవత్సరంలో ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు పంటల కోసం రెండు విడతల్లో ప్రతి రైతుకు రూ.8 వేల చొప్పున ప్రభుత్వం అందజేసింది. అయితే 2019-20 ఆర్థిక సంవత్సరం నాటి నుంచి ఈ పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచిన విషయం విధితమే.


రేవంత్ అధికారంలోకి వచ్చిన అనంతరం..

రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది కొలువు తీరింది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. అలాగే ఈ పథకంలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా.. అర్హులైన రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా సాయం అందించాలనే లక్ష్యంతో.. సాగు భూములకు సంబంధించిన సమగ్ర నివేదికలను జిల్లా అధికారుల నుంచి సేకరించాలని ఆదేశించింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకంలో నగదును .. పొడిగింపు భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్ల రూపంలో దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.


వారికి ఈ పథకం వర్తించదు..

ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం సాగు భూములకు మాత్రమే వర్తింప చేయాలని నిర్ణయించింది. ఆ క్రమంలో బీడు భూములు, కొండ ప్రాంతాలు, ఫామ్ హౌస్‌లు ఈ పథకానికి అనర్హమని ప్రకటించింది. ఇక సాగు భూములు కచ్చితంగా గుర్తించేందుకు శాటిలైట్ ఇన్ఫర్మేషన్ వినియోగంపై సైతం ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో సర్వే నెంబర్లు ఆధారంగా భూమి హక్కు దారుల వివరాలను గుర్తిస్తోంది. దాంతో ప్రస్తుత డేటా ప్రకారం.. రాష్ట్రంలోని 13 శాతం రైతుల వద్దే 10 ఎకారలకు పైగా భూములున్నట్లు గుర్తించింది. 10 ఎకరాల పరిమితి వరకు రైతు భరోసా పథకం లబ్డిపై అందించాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం గతంలో చర్చించింది. కానీ 7 ఏకరాలు వరకు ఉన్న రైతులకు ఈ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది.


డిప్యూటీ సీఎం భట్టి సారథ్యంలో..

రైతులకు ప్రతి ఏటా రెండు విడతలుగా రూ.7500 సాయం అందించడానికి సంక్రాంతి నాటికి ఈ పథకం ప్రారంభించాలని సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. దీని అమలుకు సంబంధించి.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విధితమే.

For Telangana News And Telugu News

Updated Date - Dec 26 , 2024 | 08:42 PM