Share News

A.V. Ranganath: ఏసీబీ, విజిలెన్స్‌ తరహాలోనే హైడ్రా

ABN , Publish Date - Sep 15 , 2024 | 03:44 AM

హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబరులోపు ఆరినెన్స్‌ రాబోతుందని ఆ సంస్థ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వెల్లడించారు.

A.V. Ranganath: ఏసీబీ, విజిలెన్స్‌ తరహాలోనే హైడ్రా

  • అవి కూడా ప్రభుత్వ ఉత్తర్వులతో ఏర్పాటయినవే

  • జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌, వాల్టా చట్టాల కింద అధికారాలు

  • గ్రే హౌండ్స్‌, టాస్క్‌ఫోర్స్‌లాగా హైడ్రా పనితీరు

  • మాకై మేముగా ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు

  • హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబరులోపు ఆరినెన్స్‌ రాబోతుందని ఆ సంస్థ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వెల్లడించారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రంగనాథ్‌.. పలు అంశాలపై మాట్లాడారు. హైడ్రాను చట్టబద్ధం చేసేందుకు క్యాబినెట్‌ త్వరలో ఆమోద ముద్ర వేయనుందని, ఆర్డినెన్స్‌ జారీ అయితే.. తమ సంస్థకు విశేషాధికారాలు వస్తాయని చెప్పారు. ఆర్డినెన్స్‌ తర్వాత ఆరు వారాల్లోగా అసెంబ్లీ ఆమోదిస్తుందని పేర్కొన్నారు. ‘‘హైడ్రాకు చట్టబద్ధత ఉందా? లేదా? అనేదానిపై కొందరు కోర్టుకు వెళ్లారు.


అలాంటి వారికి త్వరలోనే సమాధానం దొరుకుతుంది. ప్లానింగ్‌ కమిషన్‌, క్యాబినెట్‌ సెక్రటేరియట్‌, లా కమిషన్‌, ఏసీబీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వంటివన్నీ ప్రభుత్వ నిర్ణయాల ద్వారా ఏర్పాటైనవే. ప్రభుత్వం హైడ్రాకు వాల్టా, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌ వంటి వేర్వేరు చట్టాల కింద అధికారాలను కల్పించింది’’అని వివరించారు. చెరువులు, నాలా లు, పార్కులు, రోడ్లు వంటి ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే హైడ్రా బాధ్యత అన్నారు. ‘‘లోకల్‌ పోలీసులకు టాస్క్‌ఫోర్స్‌ సహకరించినట్లుగా.. మునిసిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖలకు హైడ్రా సహకారం ఉంటుంది. గ్రేహౌండ్స్‌, టాస్క్‌ఫోర్స్‌లా హైడ్రా పనిచేస్తుంది’’ అని చెప్పారు.

Updated Date - Sep 15 , 2024 | 03:44 AM