Share News

Siddipet: చిన్నారుల కోసం ‘సత్యసాయి సంజీవని’

ABN , Publish Date - Sep 15 , 2024 | 03:01 AM

గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్య సేవలందించేందుకు సత్యసాయి సేవా సంస్థ సిద్దిపేట జిల్లా కొండపాకలో ఏర్పాటు చేసిన సత్యసాయి సంజీవని సెంటర్‌ ఫర్‌ చైల్డ్‌ హార్ట్‌ కేర్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌ ప్రారంభమైంది.

Siddipet: చిన్నారుల కోసం ‘సత్యసాయి సంజీవని’

  • సిద్దిపేట జిల్లా కొండపాకలో సేవలు ప్రారంభం

కొండపాక, సెప్టెంబరు 14 : గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత వైద్య సేవలందించేందుకు సత్యసాయి సేవా సంస్థ సిద్దిపేట జిల్లా కొండపాకలో ఏర్పాటు చేసిన సత్యసాయి సంజీవని సెంటర్‌ ఫర్‌ చైల్డ్‌ హార్ట్‌ కేర్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌ ప్రారంభమైంది. సద్గురు మధుసూదన సాయి ఈ ఆస్పత్రిని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుండె జబ్బుల బారిన పడి దేశంలో లక్షల మంది పిల్లలు చనిపోతున్నారని తెలిపారు. గుండె ఆపరేషన్లు చేయించుకునేందుకు వేచి ఉంటున్న వారి సంఖ్య అధికంగా ఉందని, ఆపరేషన్‌కు రమ్మని పిలిచే సమయానికి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ సమస్య పరిష్కారానికి మరిన్ని ఆస్పత్రుల ఏర్పాటుకు తాము సిద్ధమని పేర్కొన్నారు. కొండపాక ఆస్పత్రి ఆవరణలో పరిశోధన కేంద్రంతోపాటు నర్సింగ్‌, పారామెడికల్‌ కళాశాలను త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి, పల్వర్‌ సత్యసాయి చిల్డ్రన్స్‌ కార్డియాలజీ సెంటర్‌ డాక్టర్‌ అనగ తులసి, సత్యసాయి సంజీవని చైల్డ్‌ హార్ట్‌ కేర్‌ సెంటర్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌ రెడ్డి పాల్గొన్నారు. సత్యసాయి సంజీవని హార్ట్‌ కేర్‌ సెంటర్‌, చిన్నారుల గుండె సంరక్షణ పరిశోధన కేంద్రం ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌ రావు శనివారం ఓ ప్రకటన చేశారు.

Updated Date - Sep 15 , 2024 | 03:01 AM