Share News

Indian Navy: నేవీ రాడార్‌ ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారు..

ABN , Publish Date - Jul 20 , 2024 | 03:58 AM

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్‌ నేవీ రాడార్‌ (వేరి లో ఫ్రీక్వెన్సీ-వీఎల్‌ఎఫ్‌) ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టనున్నారు.

Indian Navy: నేవీ రాడార్‌ ప్రాజెక్టుకు ముహూర్తం ఖరారు..

  • పూడూరులో 28న రక్షణ మంత్రి, సీఎం శంకుస్థాపన

పరిగి, జూలై 19: కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇండియన్‌ నేవీ రాడార్‌ (వేరి లో ఫ్రీక్వెన్సీ-వీఎల్‌ఎఫ్‌) ప్రాజెక్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టనున్నారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం అటవీ భూములను అప్పగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనవరిలోనే ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ, ఎన్నికల కోడ్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అడ్డంకులు లేకపోవడంతో.. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రామ్మోహన్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఎస్పీ కె.నారాయణరెడ్డి ఇతర అధికారుల బృందం దామగుండం అడవుల్లో శంకుస్థాపన చేసే స్థలాన్ని శుక్రవారం పరిశీలించింది.


నేవీ రాడార్‌ ప్రాజెక్టు కోసం పూడూరు రక్షిత అటవీ భూములు 2,935 ఎకరాలను ఇచ్చేందుకు జనవరి 24న సీఎం రేవంత్‌ సమక్షంలో అటవీ, నావల్‌ కమాండ్‌ ఏజెన్సీ అధికారులు భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. రూ.2,500 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు పర్యావరణం సహా 16 రకాల అనుమతులు లభించాయి. 1,500 ఎకరాల్లో మొక్కలు పెంచనున్నారు. మొక్కల సంరక్షణ బాధ్యతను నేవీనే తీసుకోనుంది. రాడార్‌ స్టేషన్‌ను 2027 నాటికి అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. దేశంలో తమిళనాడు తిరునల్వేలిలో ఉన్న ఐఎన్‌ఎ్‌స కట్టబొమ్మన్‌ రాడార్‌ స్టేషన్‌ మొదటిది కాగా.. పూడూరు నేవీ రాడార్‌ స్టేషన్‌ రెండోది. హైదారాబాద్‌కు 60 కి.మీ. దూరంతో పాటు, సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తైన ప్రాంతం కావడంతో ఇక్కడ రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయిచారు. రాడార్‌ స్టేషన్‌ ఏర్పాటుతో పూడూరు మరో టౌన్‌షి్‌పగా మారనుంది. 3 వేల మంది వరకు ఉద్యోగులు ఇక్కడ నివసించనున్నారు.

Updated Date - Jul 20 , 2024 | 03:58 AM