Share News

Suryapet: ఉపాధి కూలీల్లో కూలీగా ఐఆర్‌ఎస్‌ అధికారి!

ABN , Publish Date - Jun 18 , 2024 | 05:36 AM

ఈ ఫొటోలోని మహిళలు ఉపాధి కూలీలు! వారి మధ్య కూర్చుని ప్లేట్లో అన్నం తింటూ కూలీల్లో కూలీగా కలిసిపోయిన యువకుడు ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారి సందీప్‌ బాగా! సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్‌, బెంగళూరు సౌత్‌ సెంట్రల్‌ ట్యాక్స్‌ కమిషనరేట్‌లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్‌ వింగ్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

Suryapet: ఉపాధి కూలీల్లో కూలీగా ఐఆర్‌ఎస్‌ అధికారి!

ఈ ఫొటోలోని మహిళలు ఉపాధి కూలీలు! వారి మధ్య కూర్చుని ప్లేట్లో అన్నం తింటూ కూలీల్లో కూలీగా కలిసిపోయిన యువకుడు ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారి సందీప్‌ బాగా! సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్‌, బెంగళూరు సౌత్‌ సెంట్రల్‌ ట్యాక్స్‌ కమిషనరేట్‌లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్‌ వింగ్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం నూతన్‌కల్‌ మండలం చిల్పకుంట్ల గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగతుంటే అక్కడకు వెళ్లారు. తానూ ఉపాధి కూలీగా మారిపోయారు. కూలీలతో కలిసి ఇంకుడు గుంతలు తీశారు. మట్టి తట్టలు ఎత్తారు.. మోశారు! పొద్దున 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా కూలీలతో కలిసి పనిచేశారు.


మధ్యాహ్నం కూలీలు చెట్ల కింద కూర్చుని సద్దులు తింటుంటే తానూ ఓ టిఫిన్‌ ప్లేట్‌ తీసుకొని అన్నం, చట్నీ అడిగి పెట్టించుకొని తిన్నారు. కొద్దిసేపు ఉపాధి కూలీలతో కలిసి బతుకమ్మ ఆడారు. పనులకు వచ్చిన 152 మందికి తన జీతం డబ్బుల నుంచి తలా రూ.200 పంచారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ పథకాలపై కూలీలకు అవగాహన కల్పించారు. ఓ ఉన్నతాధికారి కూలీలైన తమతో కలిసిపోయి పనులు చేసి.. తమతో కలిసి భోజనం చేసి, డబ్బులూ ఇవ్వడంతో కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. - నూతన్‌కల్‌

Updated Date - Jun 18 , 2024 | 05:36 AM