Share News

TG: కాంగ్రెస్‌ గూటికి ఇంద్రకరణ్‌రెడ్డి

ABN , Publish Date - May 02 , 2024 | 05:46 AM

జీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు పంపారు.

TG: కాంగ్రెస్‌ గూటికి ఇంద్రకరణ్‌రెడ్డి

కండువా కప్పి ఆహ్వానించిన దీపాదాస్‌ మున్షీ

నిర్మల్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు పంపారు. అనంతరం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలైనప్పటి నుంచి బీఆర్‌ఎ్‌సతో అల్లోల అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.


రెండు నెలల నుంచి కాంగ్రె్‌సలో చేరేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆయన చేరికను స్థానిక డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుతో పాటు పలువురు సీనియర్‌ నేతలు బలంగా వ్యతిరేకించారు. దీంతో ఒక సందర్భంలో ఇంద్రకరణ్‌ను పార్టీలో చేర్చుకోబోమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు సైతం ప్రకటించారు. కాగా, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చేరికలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో అల్లోలకు మార్గం సుగమమైంది. ఆయనతోపాటు సంచార జాతుల నాయకుడు వెన్నెల అశోక్‌ కూడా కాంగ్రె్‌సలో చేరారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి, మధు యాష్కీ సమక్షంలో వనస్థలిపురం బీజేపీ కార్పొరేటర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి హస్తం గూటికి చేరారు.

Updated Date - May 02 , 2024 | 05:46 AM