Share News

Congress: కాంగ్రెస్‌లోకి బండా ప్రకాష్‌?

ABN , Publish Date - Jul 02 , 2024 | 04:15 AM

బీఆర్‌ఎ్‌సలో మరో వికెట్‌ పడనుందా? శాసనమండలి వైస్‌ చైర్మన్‌ బండా ప్రకాష్‌ కాంగ్రె్‌సలో చేరనున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. సోమవారం ఆయన హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారంటూ ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Congress: కాంగ్రెస్‌లోకి బండా ప్రకాష్‌?

  • సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఫొటో వైరల్‌.. ఖండించిన శాసనమండలి వైస్‌ చైర్మన్‌

  • బీఆర్‌ఎస్ ను వీడేది లేదని స్పష్టీకరణ

  • బస్వరాజు సారయ్య కూడా కాంగ్రె్‌సలోకే

వరంగల్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీఆర్‌ఎ్‌సలో మరో వికెట్‌ పడనుందా? శాసనమండలి వైస్‌ చైర్మన్‌ బండా ప్రకాష్‌ కాంగ్రె్‌సలో చేరనున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. సోమవారం ఆయన హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారంటూ ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బండా ప్రకా్‌షను కాంగ్రె్‌సలో చేర్చుకునేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడంతో ఆయన పార్టీ మారడం ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బలమైన ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన బండా ప్రకా్‌షను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ వర్గానికి దగ్గర కావాలనే ఆలోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్టు సమాచారం. పాతికేళ్లకు పైగా కాంగ్రె్‌సలో కొనసాగిన బండా ప్రకాష్‌ 2017లో బీఆర్‌ఎ్‌సలో చేరి 2018లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.


2021లో ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరటంతో.. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం బండా ప్రకా్‌షతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించి ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలి సభ్యుడిని చేసింది. మండలి డిప్యూటీ చైర్మన్‌ను చేసింది. ఆయన పదవీకాలం 2027 నవంబరు 30 వరకు ఉంది. కాగా, మండలిలో కాంగ్రె్‌సకు మెజారిటీ లేకపోవడటంతో కనీసం 16 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని ఆకర్ష్‌ కార్యక్రమాన్ని చేపట్టింది.

ఇందులో భాగంగా వరంగల్‌ జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీల్లో నలుగురిని తీసుకుంటారనే ప్రచారం జరిగింది. గత శనివారం సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌ పర్యటనకు వచ్చిన సందర్భంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య.. సీఎం సలహదారు వేం నరేందర్‌రెడ్డితో రహస్యంగా చర్చలు జరిపారు. దీంతో బండా ప్రకా్‌షతోపాటు సారయ్య కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలకు కాంగ్రె్‌సతో పాతికేళ్లకు పైగా అనుబంధం ఉంది.


బీఆర్‌ఎ్‌సను వీడటం లేదు: బండా ప్రకాష్‌

తాను కాంగ్రె్‌సలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని బండా ప్రకాష్‌ అన్నారు. బీఆర్‌ఎ్‌సను వీడటం లేదని స్పష్టం చేశారు. ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం తాను హైదరాబాద్‌కు వచ్చానని, సీఎం రేవంత్‌రెడ్డిని కలవలేదని చెప్పారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటో పాతది అయి ఉండొచ్చునన్నారు.

Updated Date - Jul 02 , 2024 | 04:15 AM