తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివచరణ్‌రెడ్డి
ABN , Publish Date - Dec 26 , 2024 | 03:39 AM
తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎల్బీ నగర్‌లోని మన్సూరాబాద్‌కు చెందిన జక్కిడి శివ చరణ్ రెడ్డి ఎన్నికయ్యారు.
న్యూఢిల్లీ, మన్సూరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎల్బీ నగర్‌లోని మన్సూరాబాద్‌కు చెందిన జక్కిడి శివ చరణ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఢిల్లీలో శివ చరణ్ రెడ్డికి జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ చిబ్ నియామక పత్రాన్ని అందజేశారు. కాగా శివ చరణ్ రెడ్డి ఇటీవల జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో రెండు లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీనికి సంబంధించిన అధికారిక పత్రాన్ని ఢిల్లీలో ఆయనకు అందించారు.