Share News

job : జపాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు అవకాశాలు

ABN , Publish Date - Aug 26 , 2024 | 04:22 AM

జపాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల కొరత ఉందని, ఆ దేశ కంపెన్లీలో విదేశీయులకు మెరుగైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని జెట్రో(జపాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌) బెంగళూరు విభాగం డైరెక్టర్‌ జనరల్‌ తోషిహిరో మిజుతానీ పేర్కొన్నారు.

job : జపాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు అవకాశాలు

  • ఐఐటీ-హెచ్‌ ‘జపాన్‌ డే’లో జెట్రో డైరెక్టర్‌ జనరల్‌

కంది, ఆగస్టు 25 : జపాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల కొరత ఉందని, ఆ దేశ కంపెన్లీలో విదేశీయులకు మెరుగైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని జెట్రో(జపాన్‌ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌) బెంగళూరు విభాగం డైరెక్టర్‌ జనరల్‌ తోషిహిరో మిజుతానీ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలో ఉన్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీ-హెచ్‌)లో ఆదివారం జరిగిన 7వ జపాన్‌ కెరీర్‌ డే కార్యక్రమంలో మిజుతానీ పాల్గొన్నారు. జపాన్‌ కంపెనీలకు అవసరమైన ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ఐఐటీ-హెచ్‌లో జెట్రో ప్రతీ ఏటా జాబ్‌ మేళా నిర్వహిస్తుంది.


అయితే, జపాన్‌లో ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించేందుకు జపాన్‌ కెరీర్‌ డే పేరిట ముందుగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఐఐటీ-హెచ్‌లో ఆదివారం జరిగిన జపాన్‌ కెరీర్‌ డే కార్యక్రమంలో జపాన్‌కు చెందిన 18 కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొని వివిధ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఐఐటీ-హెచ్‌లో డిసెంబరులో జాబ్‌ మేళా నిర్వహిస్తామని మిజుతానీ ఈ సందర్భంగా ప్రకటించారు. తవు విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న జెట్రోకు ఐఐటీ-హెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి ధన్యవాదాలు తెలియజేశారు.

Updated Date - Aug 26 , 2024 | 04:22 AM