Share News

JNTU: జేఎన్‌టీయూలో సెంట్రలైజ్డ్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌..

ABN , Publish Date - Aug 30 , 2024 | 10:47 AM

జేఎన్‌టీయూ(JNTU)కు అనుబంధంగా ఉన్న ఎనిమిది ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిపోయిన సుమారు 800కు పైగా సీట్లను స్పాట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీకై రిజిస్ట్రార్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

JNTU: జేఎన్‌టీయూలో సెంట్రలైజ్డ్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌..

- 8 అనుబంధ ఇంజనీరింగ్‌ కాలేజీలకు హైదరాబాద్‌లోనే నిర్వహణ

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)కు అనుబంధంగా ఉన్న ఎనిమిది ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిపోయిన సుమారు 800కు పైగా సీట్లను స్పాట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీకై రిజిస్ట్రార్‌ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే ఏ కాలేజీలో సీట్లను ఆ కాలేజీలోకాకుండా అన్ని కాలేజీల్లో సీట్ల భర్తీకి హైదరాబాద్‌లోనే సెంట్రలైజ్డ్‌ కౌన్సెలింగ్‌ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ఇదికూడా చదవండి: CM Revanth Reddy: నా వ్యాఖ్యలు వక్రీకరించారు... సుప్రీం కోర్టు సీరియస్‌ కావడంపై రేవంత్


ఈ నెల 30న జేఎన్‌టీయూ హైదరాబాద్‌, సుల్తాన్‌పూర్‌ కాలేజీల్లో మిగిలిన సీట్లకు, 31న మంథని, జగిత్యాల జేఎన్‌టీయూ కాలేజీల్లో సీట్లకు, 2న వనపర్తి, సిరిసిల్ల, పాలేరు, మహబూబ్‌బాద్‌(Vanaparthi, Sirisilla, Paleru, Mahbubbad) జేఎన్‌టీయూ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందని.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో ఆయా తేదీల్లో జేఎన్‌టీయూలోని అడ్మిషన్స్‌ విభాగంలో హాజరుకావచ్చని తెలిపారు. స్పాట్‌ ద్వారా అడ్మిషన్‌ పొందిన అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించదని పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే సెంట్రలైజ్డ్‌ స్పాట్‌ కౌన్సెలింగ్‌ వల్ల ఖమ్మం, మహబూబాబాద్‌, మంథని, వనపర్తి, సిరిసిల్ల(Khammam, Mahabubabad, Manthani, Vanaparthi, Sirisilla) ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళ్లాల్సి రావడం ఇబ్బందికరంగా భావిస్తున్నారని కొన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. ఇంతకు ముందు మంథని జేఎన్‌టీయూ కాలేజీలో సింగరేణి కోటా సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లుగానే వర్సిటీ అడ్మిషన్‌ విభాగం అధికారులుఅనుబంధ కళాశాలలకు వచ్చి స్పాట్‌ ప్రక్రియను చేపడితే బాగుండేదంటున్నారు.


....................................................................

ఈ వార్తను కూడా చదవండి:

....................................................................

Special trains: పండుగల నేపథ్యంలో... 60 ప్రత్యేక రైళ్లు పొడిగింపు

హైదరాబాద్‌ సిటీ: దసరా, దీపావళి, క్రిస్‌మస్‌, ఛాట్‌(Dussehra, Diwali, Christmas, Chat).. తదితర పండుగల సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్యరైల్వే పరిధిలో నడుస్తున్న 60ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా సికింద్రాబాద్‌-రామనాథపురం(Secunderabad-Ramanathapuram), కాచిగూడ-మధురై, నాందేడ్‌-ఈరోడ్‌, కాచిగూడ-నాగర్‌సోల్‌, సికింద్రాబాద్‌-కొల్లాం, తిరుపతి-అకోలా, తిరుపతి-పూర్ణ, లింగంపల్లి-కాకినాడ టౌన్‌, తిరుపతి-సికింద్రాబాద్‌, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్‌-నాగర్‌సోల్‌,

city6.jpg


తిరుపతి-మచిలీపట్నం(Tirupati-Machilipatnam), సికింద్రాబాద్‌-అగర్తల, హైదరాబాద్‌-జైపూర్‌, హైదరాబాద్‌-జాల్నా, కాచిగూడ-లైగా, కాచిగూడ-హిస్సార్‌, హైదరాబాద్‌-గోరఖ్‌పూర్‌, తిరుపతి-షిరిడి సాయినగర్‌(Tirupati-Shiridi Sainagar), హైదరాబాద్‌-రెక్సాల్‌, సికింద్రాబాద్‌-ధనపూర్‌, సికింద్రాబాద్‌-సత్రగచ్చి, షాలిమార్‌-నిజాముద్దీన్‌, సికింద్రాబాద్‌-నిజాముద్దీన్‌(Secunderabad-Nizamuddin) మార్గాల్లో నడుస్తాయని పేర్కొన్నారు. ప్రత్యేకరైళ్లు అక్టోబర్‌ 2 నుంచి వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 30 , 2024 | 10:47 AM