NTR: తెలుగువారి ధైర్యం ఎన్టీఆర్.. నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
ABN , Publish Date - Jan 18 , 2024 | 11:08 AM
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కుమారుడు బాలకృష్ణ, మనమళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, మనమరాలు అలేఖ్య రెడ్డి అంజలి ఘటించారు.
హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత నందమూరి తారక రామారావు (NTR) 28వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కుమారుడు బాలకృష్ణ (Bala Krishna), మనమళ్లు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram), మనమరాలు అలేఖ్య రెడ్డి (Alekhya Reddy) అంజలి ఘటించారు.
తెలుగువారి దమ్ము, ధైర్యం ఎన్టీఆర్ అని కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌కు మరణం లేదని, ప్రజల హృదయాల్లో చిరకాలం సజీవంగా ఉన్నారని తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా నిలచిపోతాయని తెలిపారు. ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలను మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని వివరించారు. పేదవారి ఆకలిని ఎన్టీఆర్ తీర్చారని గుర్తుచేశారు.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కును ఎన్టీఆర్ కల్పించారని బాలకృష్ణ తెలిపారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని పేర్కొన్నారు. కొందరు ఎన్టీఆర్‌ను దైవంగా చూస్తారని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ నడిచిన మార్గం స్ఫూర్తిదాయకం అని వివరించారు. ఎన్టీఆర్ చూపిన మార్గంలో టీడీపీ కార్యక్రతలు నడవాలని బాలకృష్ణ కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తాం అని బాలకృష్ణ వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.