Share News

Jupally Krishna Rao,: గతంలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు: జూపల్లి

ABN , Publish Date - Dec 22 , 2024 | 04:14 AM

గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చం దంగా ప్రాజెక్టులు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు.

Jupally Krishna Rao,: గతంలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు: జూపల్లి

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చం దంగా ప్రాజెక్టులు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. శనివారం శాసనసభలో రైతుభరోసాపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్‌ పాలమూరును సస్యశ్యామలం చేశామన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి కేవలం ఒక్క పంపు మోటర్‌ స్విచ్‌ నొక్కి మొత్తం ప్రాజెక్టే అయిపోయిందని, జాతికి అంకితం చేస్తున్నామని ప్రకటించారని జూపల్లి విమర్శించారు.

Updated Date - Dec 22 , 2024 | 04:14 AM