Share News

K Kavitha: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:26 AM

అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఎక్కడాలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులతో ఆమె సమావేశమయ్యా రు.

K Kavitha: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటుదాం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఎక్కడాలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులతో ఆమె సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల హామీల అమలును కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, వారి అసమర్థతను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని సూచించారు.


ప్రతిగ్రామంలో సోషల్‌ మీడియా, వాట్సా ప్‌ గ్రూప్‌లు ఏర్పాటు చేసి కేసీఆర్‌ హయంలో ఎలాఉంది? ప్రస్తుతం ఎలాఉందనే అంశాలను ప్రజలకు చెప్పాలన్నారు. కాగా, అంతకుముందు యునైటెడ్‌ ఫూలే ఫ్రంట్‌, తెలంగాణ జాగృతి, బీసీ కుల సంఘాల ప్రతినిధులతో కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ కులగణన కమిషన్‌కు ఇచ్చే నివేదిక, ఇతర అంశాలపై ఆమె చర్చించారు.

Updated Date - Nov 25 , 2024 | 03:26 AM