Share News

Congress: అవినీతి చేసిన వారిని వదలం: మంత్రి పొన్నం

ABN , Publish Date - Jun 19 , 2024 | 12:11 PM

కరీంనగర్: స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ జరిపామని, నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అదే విధంగా నగరంలో నిర్మించిన పలు జంక్షన్లకు కావాలనే అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.

Congress: అవినీతి చేసిన వారిని వదలం: మంత్రి పొన్నం

కరీంనగర్: స్మార్ట్ సిటీ పనుల్లో (Smart City works) జరిగిన అవకతవకలపై (Mnipulations) విజిలెన్స్ విచారణ (Vigilance Investigation) జరిపామని, నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. అదే విధంగా నగరంలో నిర్మించిన పలు జంక్షన్లకు కావాలనే అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో వివిధ శాఖలపై బుధవారం పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పనుల్లో పారదర్శకత పాటించకపోతే కాంటాక్టర్లను వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. త్వరలోనే కరీంనగర్ స్మార్ట్ సిటీ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి తెలిపారు. గతంలో జరిగిన పనులపై ఫిర్యాదులు ఉన్నాయని వీటన్నింటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్డీఏ కూటమి విజయంతో అమెరికాలో ఎన్నారై సంబరాలు.

జగన్‌కు సచివాలయం నుంచి నోటీసు..

అప్పుడు జగన్ ఉపయోగించిన టెక్నిక్ ఇదే..

జగన్ నిర్వాకంపై జనంలోకి..

భూమన కరుణాకర్ రెడ్డి కుంభకోణాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 19 , 2024 | 12:14 PM