Cyber Crime: చొప్పదండి ఎమ్మెల్యేకు బెదిరింపులు
ABN , Publish Date - Oct 31 , 2024 | 04:51 AM
డబ్బుల కోసం ఓ వ్యక్తి ఏకంగా ఓ ఎమ్మెల్యేనే బెదిరించాడు. తాను అడిగినన్ని డబ్బులు ఇవ్వకుంటే.. మీ పిల్లలను అనాథలను చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు! దీంతో ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టి ఆ నిందితుడిని గుర్తించారు.
20 లక్షలు ఇవ్వకుంటే మీ పిల్లల్ని అనాథలను చేస్తా..
లండన్ నుంచి వాట్సాప్ కాల్
కేసు నమోదు చేసిన పోలీసులు
నిందితుడు మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు
నిందితుడిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ
కరీంనగర్ క్రైం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): డబ్బుల కోసం ఓ వ్యక్తి ఏకంగా ఓ ఎమ్మెల్యేనే బెదిరించాడు. తాను అడిగినన్ని డబ్బులు ఇవ్వకుంటే.. మీ పిల్లలను అనాథలను చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు! దీంతో ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టి ఆ నిందితుడిని గుర్తించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సెప్టెంబరు 28న మధ్యాహ్నం, అదే రోజు రాత్రి సమయాల్లో +447886696497 నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. తనకు రూ.20 లక్షలు చెల్లించాలని.. లేకుంటే రాజకీయంగా అప్రతిష్ఠపాలు చేయడంతోపాటు మీ ఇద్దరు పిల్లలను అనాథలను చేస్తానని నిందితుడు ఆ కాల్‌లో బెదిరించాడు.
కేసు నమోదు
దీంతో ఎమ్మెల్యే సెప్టెంబరు 29న కొత్తపల్లి పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత 308, 351(3),(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. సైబర్ టెక్నాలజీ ఆధారంగా ఆ బెదిరింపు కాల్ విదేశాల నుంచి వచ్చినట్టు నిర్ధారణకు వచ్చారు. పోలీసుల విచారణలో నిందితుడు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని భవానీనగర్‌కు చెందిన యాస అఖిలేష్ రెడ్డి(33)గా గుర్తించారు. నిందితుడు ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడని, అక్కడి నుంచే వాట్సాప్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో అతనిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్టు ఏసీపీ వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ఫోన్ నంబర్ ద్వారా జరిపిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించామని పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి:
CM Revanth Reddy: తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం!
బీఆర్‌ఎస్ వల్లే విద్యుత్ చార్జీల పెంపుపై వెనక్కి
Ponguleti :నిరుపేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం
Kaushik Reddy: నా పంచాయితీ అంతా సీఎం రేవంత్‌తోనే!
Read Latest Telangana News and National News