Share News

Minister Ponnam: విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళతాం..

ABN , Publish Date - Oct 11 , 2024 | 12:59 PM

విద్యా , వైద్యం , టూరిజం, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి కల్పన అన్నింటిపై దృష్టి సరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జీవో 190 ద్వారా నాలుగు గురుకులాలు ఒకే కాంప్లెక్స్‌గా విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ఏర్పాటు చేశామన్నారు. నాలుగవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకునేల భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు.

Minister Ponnam: విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళతాం..

కరీంనగర్ జిల్లా: హుస్నాబాద్‌కు (Husnabad) అంతర్జాతీయ స్థాయిలో (International Level) యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ (Young India Integrated Residential Complex) రావడంతో విద్యా రంగంలో హుస్నాబాద్ మరింత ముందుకు తీసుకువెళతామని,.. హుస్నాబాద్ నియోజకవర్గం, కోహెడ మండలం, తంగలపల్లి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు భూమి పూజ చేసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థి నాయకుడిగా మీ అందరి ఆశీర్వాదంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యానని, విద్యా , వైద్యం , టూరిజం, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి కల్పన అన్నింటిపై దృష్టి సరించామని చెప్పారు. జీవో 190 ద్వారా నాలుగు గురుకులాలు ఒకే కాంప్లెక్స్‌గా విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ఏర్పాటు చేశామన్నారు. నాలుగవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకునేల భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు.


విద్యా శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నప్పటికీ వివిధ విద్యా కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామిని అయ్యానని మంత్రి పొన్నం తెలిపారు. రాష్ట్రంలో 25 వేల పాఠశాలలకు రూ.1100 కోట్లతో మౌలిక వసతులు కల్పించామని, స్కూల్స్‌కు ఉచిత విద్యుత్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ సిబ్బందికి జీతాలపై ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగిందన్నారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు19 వేల ప్రమోషన్‌లు, 35 వేల బదిలీలు చేశామని, డీఎస్సీ ద్వారా 10 వేల మందికి నియామక పత్రాలు అందించామని చెప్పారు. గురుకులలో మెస్ బకాయిలు చెల్లించడంతో పాటు, అద్దె బకాయిలు కూడా చెల్లిస్తున్నామని, రూ. 5 వేల కోట్లతో ఈ పాఠశాలల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు. రూ.180 కోట్లతో ఒక్కో పాఠశాల నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు.


వచ్చే విద్యా సంవత్సరంలోపు ఈ పాఠశాల భవనం నిర్మాణం పూర్తి చేస్తామని, అన్ని రకాల వాతావరణానికి తగిన విధంగా ఈ భవన నిర్మాణం జరుగుతుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. అన్ని రకాల వసతులు అంతర్జాతీయ స్థాయిలో కల్పించి తీర్చిదిద్దుతామన్నారు. ఈ ప్రాంతం అంతా ఎడ్యుకేషన్ హబ్‌గా మారాలని.. కస్తూర్బా పాఠశాల, మోడల్ స్కూల్ ఆ రోజులోనే తెచ్చామని చెప్పారు. ఇన్నోవేషన్ పార్క్ త్వరలోనే భూమి పూజ కార్యక్రమం ఉంటుందని, బస్వపూర్‌లో కృషి విజ్ఞాన కేంద్రంకు స్థల పరిశీలన చేశామని, త్వరలోనే భూమి పూజ కార్యక్రమం చేసుకుంటామన్నారు. సర్వాయి పేటలో టూరిజం హబ్, ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి రూ. 37 కోట్లు కేటాయించుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్ర వ్యాప్తంగా 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన: మంత్రి

జాయ్ జమీమా దారుణాలు.. వెలుగులోకి వస్తున్న నిజాలు..

సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి

విజయవాడ: మహిషాసురమర్ధినిగా అమ్మవారి దర్శనం..

ఎనిమిదవ రోజుకు చేరుకున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 11 , 2024 | 01:00 PM