Kavitha: భయపడే రక్తం మాది కాదు భయపెట్టే రక్తం మాది
ABN , Publish Date - Dec 30 , 2024 | 03:56 AM
‘బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే నాపై, కేటీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయి.
కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే నాపై, కేటీఆర్‌పై కేసులు: ఎమ్మెల్సీ కవిత
సుభా్‌షనగర్ (నిజామాబాద్), డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే నాపై, కేటీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయి. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా భయపడే ప్రసక్తి లేదు. మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కవిత జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎ్‌ఫఎస్ చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
తప్పు చేయనిది భయపడే ప్రసక్తే లేదని, ఎన్ని కేసులు పెట్టినా బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటకు వస్తారన్నారు. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని దేనికీ భయపడనని చెప్పారు. ప్రశ్నిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసులు పెడుతోందని, ఇక రాష్ట్రంలో అక్రమ కేసులపై చెప్పనవసరం లేదన్నారు. హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలమైందని, గ్రామాల్లో హామీలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు.