KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ చండీయాగం
ABN , Publish Date - Sep 07 , 2024 | 04:52 AM
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో యాగం నిర్వహించారు.
ప్రతికూల పరిస్థితులు అధిగమించే సంకల్పం
హైదరాబాద్, మర్కుక్, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో యాగం నిర్వహించారు. తన సతీమణి శోభతో కలిసి ఆయన నవగ్రహ మహాయాగం, చండీయాగం నిర్వహించారు. శుక్రవారం ఉదయం 11గంటల నుంచి మఽధ్యాహ్నం 1.30గంటలవరకు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, యాగక్రతువును నిర్వహించారు.
రాజకీయంగా ప్రతికూల వాతావరణం ఏర్పడటం, కేసుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడేందుకు వేద పండితుల సూచనమేరకు కేసీఆర్ ఈ యాగం నిర్వహించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అధికారం చేపట్టాక కేసీఆర్ 2015లో చండీయాగం, 2018, 2023లో రాజశ్యామల యాగం చేశారు. అయితే, శుక్రవారం జరిపిన నవగ్రహ మహాయాగానికి అతికొద్ది మందే హాజరయ్యారు. మాజీమంత్రి తన్నీరు హరీ్‌షరావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్‌కుమార్ పాల్గొన్నారు.