KCR: కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి అజరామరం
ABN , Publish Date - Sep 27 , 2024 | 03:31 AM
తెలంగాణ ఆత్మగౌరవం కోసం, పోరాటాలు నడిపిన తొలితరం ఉద్యమ నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి అజరామరమని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు.
![KCR: కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి అజరామరం](https://media.andhrajyothy.com/media/2024/20240925/16_41ec184f38_v_jpg.webp)
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
తెలంగాణ ఆత్మగౌరవం కోసం, పోరాటాలు నడిపిన తొలితరం ఉద్యమ నేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి అజరామరమని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. రాజకీయవేత్తగా తెలంగాణ అస్తిత్వాన్ని చాటేందుకు బాపూజీ నడిపిన రాజీలేని పోరాటాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కేసీఆర్ పేర్కొన్నారు.
శుక్రవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. బడుగుబలహీన వర్గాల అభున్నతే లక్ష్యంగా తన జీవితకాలం పోరాడిన బాపూజీ ఆకాంక్షలకు అనుగుణనంగా పదేండ్ల పాలన కొనసాగిందని కేసీఆర్ అన్నారు.