Share News

Brinda Karat: జమిలి ఎన్నికలు కాదు.. మహిళలకు రక్షణ కల్పించాలి

ABN , Publish Date - Oct 21 , 2024 | 06:14 PM

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలపై వివక్ష, రాజ్యాంగంపై దాడి, అధిక ధరలతో పెను భారమవుతోందని సీపీఏం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. జమిలీ ఎన్నికలు కాదు, జనాభాలో సగం మహిళలు, 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని బృందా కారత్ కోరారు.

Brinda Karat: జమిలి ఎన్నికలు కాదు.. మహిళలకు రక్షణ కల్పించాలి

భద్రాద్రి కొత్తగూడెం: దేశంలో మహిళలకు రక్షణ కరువైందని సీపీఏం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. కొత్తగూడెం పట్టణంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఐద్వా రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ సభలో ఇవాళ(సోమవారం) సీపీఏం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ పాల్గొన్నారు. రైతు రుణమాఫీ తరహాలో మహిళల మైక్రో ఫైనాన్స్ రుణాలు రద్దు చేసి ఆర్ధిక పురోగతి కల్పించాలని కోరారు. కొత్తగూడెంలో మహిళా ర్యాలీ కొత్త వెలుగులకు మార్గం కావాలని బృందా కారత్ సూచించారు.


దేశంలో మైక్రో ఫైనాన్స్ ఇతర రుణ సంస్థల వేధింపులను కట్టడి చేసి మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని అన్నారు. బాధితులకు న్యాయం సైతం అందటం లేదని, దోషులకు శిక్షలు నామమాత్రమేనని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలపై వివక్ష, రాజ్యాంగంపై దాడి, అధిక ధరలతో పెను భారమవుతోందని చెప్పారు. జమిలీ ఎన్నికలు కాదు, జనాభాలో సగం మహిళలు, 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని బృందా కారత్ కోరారు.


మహాసభలకు కొత్తగూడెం పట్టణం ముస్తాబు...

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) రాష్ట్ర నాలుగో మహాసభలకు భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణం ముస్తాబైంది. పట్టణంలోని కొత్తగూడెం క్లబ్‌లో సోమవారం ఈ మహాసభలు. ప్రారంభమయ్యాయి.. ఈ సందర్భంగా ఐద్వా జెండాలు, తోరణాలతో కొత్తగూడెం పట్టణంలోని ప్రధాన కూడళ్లను అలంకరించారు. మహిళా ప్రదర్శన ప్రారంభమయ్యే పాత డిపో నుంచి విద్యానగర్ వరకు, బస్టాండ్ సెంటర్ నుంచి ప్రతినిధుల సభ జరిగే కొత్తగూడెం క్లబ్ వరకు జెండాలు, తోరణాలు, మహిళా అమరవీరుల ఫొటోలతో అలంకరణ చేశారు.


ఈ మహాసభలకు తెలంగాణ వ్యాప్తంగా 600 మంది ప్రతినిధులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. ఈ బహిరంగసభకు దేశవ్యాప్తంగా పలు మహిళా ఉద్యమాలకు నాయకత్వం వహించిన మాజీ రాజ్యసభ సభ్యురాలు బృందాకరత్, ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే. శ్రీమతి, ప్రధాన కార్యదర్శి మరియం, దావేలే వంటి ముఖ్యనేతలు విచ్చేశారు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింస, వేధింపులు, కేంద్ర ప్రభుత్వ మనువాద భావజాలానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలన్నింటినీ ఈ మహాసభల్లో నాయకులు ప్రజలకు వివరించారు. మహాసభల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రజా సంఘాల నాయకులతో కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ మహాసభల విజయవంతానికి కృషి చేయాలని ఐద్వా నాయకులు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

KTR: కాంగ్రెస్, బీజేపీ నేతలవి రహస్య ఒప్పందాలు..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth: వాటిపై దాడి చేస్తే వదలిపెట్టం.. సీఎం మాస్ వార్నింగ్

Jupally Krishna Rao,: బీఆర్ఎస్ నేతలు విద్యార్థులను రెచ్చగొట్టారు ... మంత్రి జూపల్లి ధ్వజం

Etela Rajender: అంతా చేసింది పోలీసులే.. ఎంపీ సంచలన ఆరోపణలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 21 , 2024 | 07:17 PM