Share News

Bhatti Vikramarka: ఆగస్టు 15న రైతులను రుణ విముక్తి చేస్తాం..

ABN , Publish Date - Aug 09 , 2024 | 03:45 PM

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2 లక్షల రైతుల రుణ మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చామని.. చేసి చూపిస్తున్నామని తెలిపారు.

Bhatti Vikramarka: ఆగస్టు 15న రైతులను రుణ విముక్తి చేస్తాం..
Deputy CM Bhatti Vikramarka

ఖమ్మం, ఆగస్టు 9: కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 2 లక్షల రైతుల రుణ మాఫీ చేస్తాం అని హామీ ఇచ్చామని.. చేసి చూపిస్తున్నామని తెలిపారు. జూలై 15 న జీవో ఇచ్చామని.. 18 జూలైన ఒక లక్ష రూపాయల రుషమాఫీ 6,983 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రెండవ సారీ రూ.6190.02 కోట్లతో జూలై మాసంలో మళ్ళీ విడుదల చేశామన్నారు.

Supreme Court: విద్యాసంస్థల్లో హిజాబ్‌లు ధరించొచ్చు.. సుప్రీం సంచలన తీర్పు


లక్షన్నర వరకు రుణం ఉన్న వాళ్ళందరికి నేరుగా 12289 కోట్లు 16.29 లక్షల కుటుంబాలకు నిధులు విడుదల చేశామని తెలిపారు. రెండు లక్షల వరకు ఆగష్టు 15లోపు చేస్తామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో నిబద్ధతతో పని చేస్తున్నామన్నారు. ఆగస్ట్ 15లోపు రుణాలు వైరాలో భారీ రైతు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు. వైరా నుంచి ఆగష్టు 15న రాష్ట్రంలో రైతులకు రుణ విముక్తి చేస్తామని స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చాలెంజ్ చేశారని.... కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం వైరా సభలో రైతులు పండుగ లాగా పాల్గొని మన రైతాంగ సోదరులు మంచి సందేశం ఇచ్చేలా సభ జరుపుతామన్నారు.

YS Jagan: ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోంది: వైఎస్ జగన్


రాష్ట్ర బడ్జెట్‌లో రుణ మాఫీ ఒక్కటే కాదు... రైతు భీమాకి సంబంధించి ఒక వెయ్యి , 500 కోట్లు రైతుల తరుపున ప్రభుత్వం కడుతుందన్నారు. క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నామన్నారు. రైతులు కట్టాల్సిన రూ.1,350 కోట్లు కడుతున్నామని వెల్లడించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.72 వేల కోట్లు కేటాయించామన్నారు. పండే ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఉద్యానవన పంటలు, డ్రిప్, సింప్సన్‌కు ఆధునీకరణకు నిధులు మంజూరు చేశామన్నారు. రూ.1,450 కోట్లతో పూర్తి చేసే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేసి సీతారామ పేరు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం రూ.23 వేల కోట్లుకు పెంచి దోపిడీ చేసిందని ఆరోపించారు. ఆనాటి నుంచి కాంగ్రెస్ ఖండిస్తూ వస్తోందన్నారు. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టినా ఒక ఎకరాకు నీరు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రుల సమక్షంలో రివ్యూ చేశామన్నారు. తక్కువ ఖర్చుతో నీళ్ళు పారించే విధానంతో అతి తక్కువ ఖర్చుతో కేవలం రూ.75 కోట్లతో లక్షన్నర ఎకరాలు పండించేలా సీతారామ ప్రాజెక్ట్ లింకు కెనాల్‌తో పనులు చేశామన్నారు. ఎన్‌ఎస్‌పీ లింకు , వైరా కెనాల్‌కు లింకు కలపటమే రేపటి కార్యక్రమమని... ఇదీ మా నిబద్ధతకు తార్కాణం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

KTR: కవిత జైలులో ఇబ్బంది పడుతోంది.. కేటీఆర్ ఆవేదన

KTR: ప్రభుత్వ నిర్వాకంతో నగర ప్రజలకు తీవ్ర నష్టం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 09 , 2024 | 04:39 PM