Jagadish reddy: పథకం ప్రకారమే మాపై దాడి
ABN , Publish Date - Sep 03 , 2024 | 04:41 PM
Telangana: ఖమ్మం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మాజీ మంత్రులపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బీఆర్ఎస్ నేతలకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనను మాజీ మంత్రులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఖమ్మం బీఆర్‌ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..
ఖమ్మం, సెప్టెంబర్ 3: ఖమ్మం ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మాజీ మంత్రులపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బీఆర్ఎస్ నేతలకు గాయాలు అయ్యాయి. ఈ ఘటనను మాజీ మంత్రులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఖమ్మం బీఆర్‌ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్టంలో పాలన బాగోలేగదని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి (Former Minister Jagadish Reddy) వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చామని... ఇది ప్రభుత్వ వైఫల్యం అని బాధితులు చెబుతున్నారన్నారు.
BRS VS Congress: ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ మాజీ మంత్రులపై దాడి.. ఎందుకంటే..?
ఈరోజు పథకం ప్రకారం తమపై దాడి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ గుండాలు పోలీసుల ముందే దాడి చేశారన్నారన్నారు. దాడి చేసిన గుండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘ మంత్రులు నీతులు చెపుతారు. జరిగిన దాడిపై ఖండించండి’’ అని అన్నారు. వరద వచ్చినా మంత్రులు నిద్రలోనే ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రజలు చెపితేనే లేచారన్నారు. ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగిందని నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ‘‘ప్రతిపక్షాలు రావాలని సహాయం చేయాలంటారు. వచ్చిన మాపై దాడి చేస్తారా. మీ వైఫల్యం దాచడానికి ఈ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మమ్మలను బెదిరించలేరు. ప్రజల చేత మీకు బుద్ది చెప్పిస్తాం. పోలీస్ అధికారులు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇలాంటివి చిల్లర వాటిని పట్టించుకోవద్దు’’ అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.
AP Politics: జగన్‌కి ఇద్దరు బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..
ప్రతిపక్షంగా మేము చేయాల్సిన బాధ్యత మాపై ఉంది
‘‘ఖమ్మం ప్రజలు మూడు రోజులుగా అల్లడుతున్నారు..ప్రతిపక్షంగా మా పని.. మేము చేయాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. వరద బాధితులకు సహాయం చేయడానికి బీఆర్‌ఎస్ నాయకులు వచ్చారని తెలిపారు. వచ్చిన పని వదిలేసి ప్రతిపక్షంపై బురద జల్లుతూ వరద బాధితులను కాంగ్రెస్ నేతలు మరిచారని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ గుండాలతో మాపై హత్యాయత్నం చేయించారు. మాపై దాడికి మంత్రులదే బాధ్యత. దాడి కారణమైన వారిపై సిపికి ఫిర్యాదు చేస్తాం. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. పోలీసులకు పిర్యాదు చేస్తాం. ఉద్యమం నడిపిన చరిత్ర బీఆర్‌ఎస్‌కు ఉంది. మాపై దాడి జరిగింది చర్యలు తీసుకోవాలి. వరద బాధితులను ఆదుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
AP Politics: జగన్‌కి ఇద్దరు బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..
హరీష్‌రావు మాట్లాడుతూ.. ఈరోజు ఖమ్మంలో జరిగిన దాడిని డీజీపీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర సాయం కోసం గట్టిగా నిలదీయలేకపోతున్నారని విమర్శించారు. ఇంత విపత్తు జరిగిన కేంద్రాన్ని రేవంత్ ఎందుకు నిలదీయడం లేదని హరీష్‌రావు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
Etela: వరద ప్రాంతాల్లో త్వరలోనే కేంద్ర బృందాలు పర్యటన
Mahesh kumar: బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ?
Read Latest Telangana News And Telugu News