Share News

TS NEWS: వాస్తవాలకు దగ్గరగా రాష్ట్ర బడ్జెట్‌: కూనంనేని సాంబశివరావు

ABN , Publish Date - Feb 10 , 2024 | 10:21 PM

కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ను రూపొందించిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) అన్నారు.

TS NEWS: వాస్తవాలకు దగ్గరగా రాష్ట్ర బడ్జెట్‌: కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ను రూపొందించిందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) అన్నారు. శనివారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ... ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సీపీఐ సమర్థిస్తుందని తెలిపారు. అందరికీ సమానంగా బడ్జెట్‌ను కేటాయించారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో భాగంగా అభయ హస్తం(ఆరు గ్యారంటీలు)లకు 53,981 కోట్లు కేటాయించడంతో కాంగ్రెస్ నిజాయితీ ఏమిటో కనిపించిందన్నారు. కౌలు రైతులకు రైతు బంధును కేటాయించడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పేరుతో వేల కోట్లను కొల్లగొట్టారని ఆరోపించారు. ధరణిని సవరించడానికి తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో డబ్బులు వృథా చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం సాగు, తాగు నీటికి ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు.

ప్రతి మండలంలో పబ్లిక్ స్కూళ్లు పెట్టడం సంతోషకరమన్నారు. వైద్య బీమాను 5 నుంచి 10 లక్షలకు పెంచడం పట్ల సీపీఐ సమర్థిస్తుందని తెలిపారు. ఇళ్లు లేని వారికి ఇంటిని కట్టి ఇస్తామనడం శుభ పరిణామమని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు అవినీతి జరిగిందని.. దాని మీద విచారణ చేపట్టడాన్ని సీపీఐ సమర్థిస్తుందని కూనంనేని సాంబశివరావు అన్నారు.

Updated Date - Feb 10 , 2024 | 10:21 PM