TG News: జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం: మంత్రి పొంగులేటి
ABN , Publish Date - Jun 11 , 2024 | 05:37 PM
జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఈ మేరకు ఆయన పాఠశాలల పునఃప్రారంభం సహా పలు అంశాలపై కొత్తగూడెం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం: జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఈ మేరకు ఆయన పాఠశాలల పునఃప్రారంభం సహా పలు అంశాలపై కొత్తగూడెం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పేద పిల్లలకు మంచి విద్య అందించే లక్ష్యంతో అమ్మ ఆదర్శ పాఠశాలలు పనిచేస్తాయని మంత్రి చెప్పుకొచ్చారు.
మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. "రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం విద్యతోపాటు ఇంగ్లీష్ మీడియం కూడా అందిస్తున్నాం. కళాశాల విద్యకూ పెద్దపీట వేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలకు మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైంది. రూ.39వేల కోట్లతో మిషన్ భగీరథ పథకం ప్రారంభించినా.. జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు వాటర్ సప్లై అధ్వానంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ పథకాన్ని పునరుద్ధరించి గిరిజన ప్రాంతాలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తాం. ధరణిపై కమిటీ నివేదిక త్వరలో రానుంది, అందులోని ఇబ్బందికర అంశాలను తొలగించి, పెండింగ్‌లో ఉన్న 2.55లక్షల దరఖాస్తులు పరిష్కరిస్తాం. విత్తనాలు అందుబాటులో లేవని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. మేలైన ఒకే రకం విత్తనాలపై ప్రచారం చేసి కృత్రిమ డిమాండ్ సృష్టిస్తూ రైతులను బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ఉండదంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ కట్ అనే సమస్యే లేదు. ప్రభుత్వ స్థలాలను ఏ స్థాయి వ్యక్తులు కబ్జా చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు మూసుకొని ఉండదు" అని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి:
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు