TS NEWS: ఖమ్మం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
ABN , Publish Date - Mar 02 , 2024 | 10:50 PM
నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. నగరంలోని ఖానాపూరం హవేలీ స్టేషన్ పరిధిలో 4 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకెట్లుగా చేసి గంజాయి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో నిందితులను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు.
ఖమ్మం జిల్లా: నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు. నగరంలోని ఖానాపూరం హవేలీ స్టేషన్ పరిధిలో 4 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకెట్లుగా చేసి గంజాయి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో నిందితులను రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. గంజాయి కొనే వారిని సైతం ఖానాపూరం హవేలీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కియా కారు, 7 సెల్ ఫోన్లు, ఆపిల్ ఐపాడ్, లక్ష రూపాయల విలువైన సెల్‌ఫోన్లను స్వాధీన పరుచుకున్నారు. గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ వారిలో ఒక మైనర్ కూడా ఉన్నారని సీపీ సునీల్ దత్ మీడియాకు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ముదిగొండ మండలంలో భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం
ముదిగొండ మండలం పండ్రేగుపల్లి బీవీఆర్ స్టోన్ కర్షర్ వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.4లక్షల 36 వేల విలువైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను పోలీసులకు అప్పగించారు. స్టోన్‌క్రషర్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.