Share News

Suicide: ములుగు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య

ABN , Publish Date - Dec 02 , 2024 | 10:04 AM

ములుగు జిల్లా: వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్ఐ నిన్న (ఆదివారం) రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఎవరు ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఆత్మహత్యకు ఇంట్లో కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణంగా సమాచారం. రిసార్ట్స్‌ సిబ్బంది ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు.

Suicide: ములుగు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య

ములుగు జిల్లా: వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ (SI Rudrarapu Harish) ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. పూసూరు గోదావరి బ్రిడ్జి సమీపంలోని ఫెరిడో రిసార్ట్స్‌లో తుపాకితో కాల్పుచుకుని చనిపోయారు. ఆదివారం ఉదయం ఒంటరిగా వెళ్లిన ఎస్ఐ రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో వేసి చూసిన స్టేషన్ సిబ్బంది సోమవారం ఉదయం రిసార్డ్స్‌కు వెళ్లి చూడగా హరీష్ విగతజీవిగా కనిపించారు.

ఎస్ఐ నిన్న (ఆదివారం) రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఎవరు ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఆత్మహత్యకు ఇంట్లో కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణంగా సమాచారం. రిసార్ట్స్‌ సిబ్బంది ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు. దీంతో సోమవారం ఉదయం వాజేడు పోలీసులకు సిబ్బంది సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్న తర్వాత రిసార్ట్స్‌ సిబ్బంది డోర్ పగులగొట్టి చూడగా ఎస్ఐ విగతజీవిగా పడి ఉన్నారు.


ఇటీవల కాలంలో మావోయిస్టులకు సంబంధించి ఇద్దరు మావోయిస్టు కొరియర్లను హత్య చేయడం ఎస్ఐ హరీష్ పరిధిలోనే జరిగింది. తర్వాత నిన్న జరిగిన ఎన్ కౌంటర్‌కు సంబంధించి అధికారులు ఎస్ఐకు ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. విధుల్లో భాగంగానే ఇంటి నుంచి బయటకు వచ్చిన హరీష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

sibhitha.jpg

ఇదిలా ఉండగా కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి శ్రీరాంనగర్‌ కాలనీలోని సీ బ్లాక్‌లోని తన ఫ్లాట్‌లో ఆమె.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

'బ్రహ్మగంతు', 'నినిదలే' సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో ఆమె నటించింది. గతేడాది ఆమె వివాహం చేసుకున్నారు. భర్త సుధీర్‌తో కలిసి శ్రీరాంనగర్‌ కాలనీలో నివాసం ఉంటుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియ రాలేదు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బెంగళూరు తరలించనున్నట్టు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

పులి జాడ కోసం కాగజ్‌నగర్ అడవుల్లో అన్వేషణ

కార్తీక మాసం చివరి రోజు పోలి పాడ్యమి..

ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్..

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 02 , 2024 | 10:12 AM