Thummala Nageswara Rao: ప్రతి గ్రామానికి విద్య, వైద్య సౌకర్యాలు కల్పించే బాధ్యత నాది
ABN , Publish Date - Feb 21 , 2024 | 01:58 PM
అరాచకం, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తి ఆత్మీయ సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ... ప్రలోభాలకు గురి చేసినా.. బెదిరించినా తన గెలుపునకు కృషి చేసిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.
ఖమ్మం: అరాచకం, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తి ఆత్మీయ సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ... ప్రలోభాలకు గురి చేసినా.. బెదిరించినా తన గెలుపునకు కృషి చేసిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీ నేతలు కలిసి ప్రజాస్వామ్యంగా పనిచేసే వారని తుమ్మల తెలిపారు.
రహదారులు, విద్య, వైద్యం ప్రతి గ్రామానికి సౌకర్యం కల్పించే బాధ్యత తనదన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. నాయకుడు ప్రజల్లో నుంచి రావాలని తుమ్మల అన్నారు. మార్కెట్ కమిటీలు... ఆలయ కమిటీల నియామకంలో పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకోవాలన్నారు. పోలీస్, రెవెన్యూ సమస్యలపై గ్రామ.. మండల కమిటీలు భాధ్యతగా వ్యవహరించాలన్నారు. గత ప్రభుత్వంలో అధికారులు ఒత్తిళ్లతో తప్పులు చేశారన్నారని... అలాంటివి పునరావృతం అవొద్దన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనలో ఆరు గ్యారంటీ పథకాల అమలుతో పేదల జీవితాల్లో వెలుగులు వచ్చాయని తుమ్మల అన్నారు.