Kishan Reddy: తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉంది.. 17 స్థానాలు టార్గె్ట్
ABN , Publish Date - Mar 07 , 2024 | 12:35 PM
బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ నిర్వహిస్తున్నారు. ఈనెల 12న అమిత్ షా పర్యటనపై సైతం సమావేశంలో చర్చించారు.
హైదరాబాద్: బీజేపీ (BJP) కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అధ్యక్షతన జరిగింది. పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ నిర్వహిస్తున్నారు. ఈనెల 12న అమిత్ షా (Amit Shah) పర్యటనపై సైతం సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ (Parliament) ఎన్నికల కోసం పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలన్నారు. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు. అనుకూల వాతావరణాన్ని బీజేపీకి మరింత సానుకూలంగా మార్చుకోవాలని కిషన్ రెడ్డి తెలిపారు.
ప్రధాని మోదీ (PM Modi) అదిలాబాద్, సంగారెడ్డి సభలు విజయవంతం అయ్యాయన్నారు. పార్టీ బలహీనంగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా విజయ సంకల్పయాత్ర విజయవంతమైందన్నారు. పార్టీ జెండా మీదనే యాత్ర నిర్వహించామని తెలిపారు. బీజేపీపై కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టాలన్నారు. బీజేపీను దెబ్బ తీయాలని కుట్ర చేస్తున్నారని.. 17స్థానాల్లో విజయం సాధించే విధంగా ఎన్నికల నిర్వహణ ఉండాలని కిషన్ రెడ్డి కోరారు.
MLC Kavitha: లిక్కర్ కేసు...పెద్ద కేసు కాదు: ఎమ్మెల్సీ కవిత
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.