Share News

Kishan Reddy : ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను వాడండి

ABN , Publish Date - Sep 04 , 2024 | 03:01 AM

వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌(ఎ్‌సడీఆర్‌ఎ్‌ఫ)ను తక్షణమే వినియోగించి బాధితులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Kishan Reddy : ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను వాడండి

  • రాష్ట్ర సర్కారు వద్ద 1,345 కోట్లు ఉన్నాయ్‌

  • అందులో కేంద్రం వాటా కూడా.. ఉంది

  • యూసీలు ఇస్తే మరిన్ని నిధులు

  • ఈసారీ ఘనంగా విమోచన దినం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫండ్‌(ఎ్‌సడీఆర్‌ఎ్‌ఫ)ను తక్షణమే వినియోగించి బాధితులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.1,345 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు ఉన్నాయని తెలిపారు. మంగళవారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్‌డీఆర్‌ఎ్‌ఫకు కేంద్రం కూడా నిధులు ఇస్తుందని చెప్పారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ వినియోగానికి సంబంధించిన సర్టిఫికెట్ల(యూసీ)ను కేంద్రానికి సమర్పించకపోవడంతో గత జూన్‌ 1న రూ.208కోట్లు విడుదలైనా రాష్ట్రానికి చేరుకోలేదన్నారు. అత్యవసర పరిస్థితు ల దృష్ట్యా యూసీలు ఇవ్వకున్నా రాష్ట్రానికి ఆ నిధులు విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కోరానని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం రూ.3లక్షల పరిహారం ఇస్తుందని కిషన్‌రెడ్డి చెప్పారు.

సీఎం రేవంత్‌ ప్రకటించిన రూ.5 లక్షల పరిహారంలో కేంద్రం వాటా ఉందా? లేక రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందా..? స్పష్టం చేయాలని కోరారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో హైదరాబాద్‌ ముక్త్‌ దివస్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో భారీవర్షాలు, వరదపై ఎంపీ ఈటల రాజేందర్‌తో కలిసి కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల పరిహారం, నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని ఈటల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 04 , 2024 | 03:01 AM