Kishan Reddy: తెలంగాణ ప్రజల గుండె చప్పుడు బీజేపీ
ABN , Publish Date - Jun 06 , 2024 | 01:08 PM
రానున్న రోజుల్లో తెలంగాణ(telangana)లో బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చే విధంగా సమిష్టిగా పనిచేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి(Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) పార్టీ అయిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాదు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఆరు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.
రానున్న రోజుల్లో తెలంగాణ(telangana)లో బీజేపీ(BJP) అధికారంలోకి వచ్చే విధంగా సమిష్టిగా పనిచేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి(Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) పార్టీ అయిపోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాదు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఆరు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్(congress) పార్టీ రాష్ట్రంలో అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను ఇంకా నెరవేర్చడం లేదని గుర్తు చేశారు. ఫ్రీ ఆర్టీసీ బస్సు హామీ తప్ప ఏదీ నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ పోటీ చేసి బీజేపీని ఓడించాలని చూసిందని కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. కానీ వారు అనుకున్నది జరగలేదని వెల్లడించారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అత్యధికంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లకు బలమైన ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ(BJP) ఆవిర్భవించింది.
రాష్ట్రంలో బీజేపీ తెలంగాణ ప్రజల గుండెచప్పుడు అయ్యి సమస్యల గురించి నిలదీస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఇటివల ఏపీ(ap)లో చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరి, పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఎన్డీయే కూటమి బ్రహ్మాండమైన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో ఏపీ ప్రజలకు మంచి రోజులు రానున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి:
Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. రేపు తాగునీటి సరఫరాలో అంతరాయం
Priyanka Gandhi : అన్నా.. గర్విస్తున్నా!
Read Latest Telangana News and National News