Komati Reddy: కేసీఆర్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన కోమటిరెడ్డి
ABN , Publish Date - Feb 06 , 2024 | 08:52 PM
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాకింగ్ న్యూస్ చెప్పారు. నేడు సచివాలయంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఉంటదో, ఊడుతుందో నాలుగు రోజులలో తెలుస్తుందన్నారు.
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి షాకింగ్ న్యూస్ చెప్పారు. నేడు సచివాలయంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఉంటదో, ఊడుతుందో నాలుగు రోజులలో తెలుస్తుందన్నారు. కేసీఆర్ వైఖరి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. నల్లగొండ సభ పెట్టే లోపే చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతారని కేసీఆర్‌కు కోమటిరెడ్డి షాకిచ్చారు. ఇక కాళేశ్వరంపై మంత్రి స్పందిస్తూ.. కేసీఆర్ తెలివి తక్కువోడు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందన్నారు.