Kavitha Arrest: కవిత అరెస్ట్‌పై ఈడీ అధికారులను నిలదీస్తున్న కేటీఆర్
ABN , Publish Date - Mar 15 , 2024 | 06:44 PM
కవిత అరెస్ట్ వార్త తెలుసుకుకున్న ఆమె అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హుటాహుటిన నివాసానికి చేరుకున్నారు. మరోవైపు కవిత బావ, మరో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా కవిత ఇంటికి చేరుకున్నారు. ఈడీ, ఐటీ అధికారులతో వారించి వీరిద్దరూ ఇంట్లోకి వెళ్లారు. కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఐటీ, ఈడీ అధికారులను కేటీఆర్, హరీశ్ రావులు గట్టిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం కూడా జరిగింది.
హైదరాబాద్: కవిత అరెస్ట్ వార్త తెలుసుకుకున్న ఆమె అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హుటాహుటిన నివాసానికి చేరుకున్నారు. మరోవైపు కవిత బావ, మరో మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా కవిత ఇంటికి చేరుకున్నారు. ఈడీ, ఐటీ అధికారులతో వారించి వీరిద్దరూ ఇంట్లోకి వెళ్లారు. కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఐటీ, ఈడీ అధికారులను కేటీఆర్, హరీశ్ రావులు గట్టిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం కూడా జరిగింది.
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. కావాలనే శుక్రవారం వచ్చారని, సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దంటూ హుకుం జారీ చేస్తున్నారని ఐటీ అధికారులపైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితను ఈరోజు (శుక్రవారం) మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం లేదంటూనే అరెస్టు చేశారని కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.