Hyderabad: 29న దీక్షా దివస్: కేటీఆర్
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:23 AM
తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ చేపట్టిన దీక్షను స్ఫూర్తిగా తీసుకుని.. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ చేపట్టిన దీక్షను స్ఫూర్తిగా తీసుకుని.. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 33 జిల్లా కేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో 29న దీక్షా దివ్‌సను నిర్వహించేందుకు ఇన్‌చార్జ్‌లను నియమించినట్లు తెలిపారు.
ఇందుకోసం 26న సన్నాహక సమావేశాలు, 29న నిమ్స్‌లో అన్నదాన కార్యక్రమం చేపడతామన్నారు. కేసీఆర్ దీక్ష విరమించిన డిసెంబరు 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. దీక్షా దివస్ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్ హాజరుకారని, ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ కార్యక్రమాలని కేటీఆర్ వెల్లడించారు. రేవంత్‌రెడ్డిది నోరైతే నిజాలు వస్తాయని.. మూసీ అయితే మాయమాటలే వస్తాయని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు.