Share News

Hyderabad: కాంగ్రెస్‌ పాలనంతా ఉత్తదే: కేటీఆర్‌

ABN , Publish Date - Dec 08 , 2024 | 04:35 AM

కాంగ్రెస్‌ ఏడాది పాలనపై రసమయి బాలకిషన్‌ రూపొందించిన ‘నమ్మి నానబోస్తే’ లఘు చిత్రాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం తెలంగాణ భవన్‌లో వీక్షించారు.

Hyderabad: కాంగ్రెస్‌ పాలనంతా ఉత్తదే: కేటీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఏడాది పాలనపై రసమయి బాలకిషన్‌ రూపొందించిన ‘నమ్మి నానబోస్తే’ లఘు చిత్రాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం తెలంగాణ భవన్‌లో వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనంతా ఉత్తదే అనే విషయాలను ఈ లఘు చిత్రం సరిగా చూపించిందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో జరుగుతున్న అవకతవకలను కళ్లకు కట్టినట్లుచూపించారని రసమయిని ప్రశంసించారు. రసమయి మాట్లాడుతూ.. ఇలాంటి షార్ట్‌ ఫిలింలు ఇకపై నెలకొకటి తీసుకుకొచ్చే విధంగా ప్రయత్నిస్తానన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 04:35 AM